వడ్లను మేమే కొంటం

వడ్లను మేమే కొంటం
  • యాసంగి వడ్లను మేమే కొంటం
  • ప్రతి గింజను మేమే కొంటాం
  • క్వింటా వడ్లకు రూ 1960 రైతులు చెల్లిస్తాం
  • రైతులు ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్మొద్దు

హైదరాబాద్: కేంద్రంలో పూర్తిగా రైతు వ్యతిరేక ప్రభుత్వం ఉందని తెలిపారు సీఎం కేసీఆర్. మంగళవారం కేబినెట్ మీటింగ్ తర్వాత మీడియాతో  మాట్లాడిన సీఎం కేసీఆర్..  కేంద్రం పంట కొనడం చేతకాక తెలివి తక్కువ మెలికలు పెడుతుందన్నారు. వ్యవసాయాన్ని కార్పోరేట్లకు అప్పగించాలని కేంద్రం కుట్ర చేస్తుందన్నారు. ఎరువుల ధరలు విపరీతంగా పెంచారని.. తెలంగాణకు ఉన్న స్థాయి కేంద్రానికి లేదన్నారు. రైతులను అవమాన పరిచి చివరకు చట్టాలను వెనక్కు తీసుకున్నారని.. కేంద్ర అసమర్ధతను ఇతరులపై నెట్టేస్తుందన్నారు. కొనుగోళ్లపై కేంద్రం పిచ్చిగా వ్యవహరిస్తోందని.. మేం వచ్చిన తర్వాత పెట్రోల్ పై వ్యాట్ పెంచలేదని తెలిపారు సీఎం కేసీఆర్. యాసంగి వడ్లను కొనాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్రతి ఊళ్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని చెప్పిన సీఎం కేసీఆర్.. రెండు , మూడు రోజుల్లో కొనుగోళ్లు ప్రారంభిస్తామన్నారు.  క్వింటా వడ్లకు రూ 1960 రైతులు చెల్లిస్తామని తెలిపారు. రైతులు ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్మొద్దని సూచించారు సీఎం కేసీఆర్.