ఆరు ప్రైవేట్ యూనివర్సిటీలకు గ్రీన్ సిగ్నల్

 ఆరు ప్రైవేట్ యూనివర్సిటీలకు గ్రీన్ సిగ్నల్
  • ఆరు ప్రైవేట్ యూనివర్సిటీలకు గ్రీన్ సిగ్నల్
  • యూనివర్సిటీ నియామకాల కోసం రిక్రూట్ మెంట్ బోర్డు

హైదరాబాద్: మే 20 నుంచి జూన్ 5 వరకు పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు సీఎం కేసీఆర్. తెలంగాణ కేబినెట్‌ సమావేశం ముగిసిన తర్వాత సీఎం కేసీఆర్ప్రగతి భవన్ లో మీడియాతో మాట్లాడారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను మరోసారి నిర్వహించాలని కేబినెట్‌ నిర్ణయించిందన్నారు. చెన్నూరు ఎత్తిపోతల పథకానికి మంత్రి మండలి ఆమోదముద్ర వేసిందని..రూ.1658కోట్లతో చెన్నూరు ఎత్తిపోతలు నిర్మించాలని నిర్ణయించామన్నారు. ఈ ఎత్తిపోతల పథకంతో ఐదు మండలాల్లోని 103 గ్రామాలకు తాగు, సాగునీరు అందనుందన్నారు. చెన్నూరు ఎత్తిపోతలకు పది టీఎంసీల కాళేశ్వరం జలాలను వినియోగించాలని కేబినెట్‌ నిర్ణయించిందని త్వరలోనే గ్రీన్ జోన్స్ మాస్టర్ ప్లాన్ అన్నారు. అలాగే ఆరు ప్రైవేట్ యూనివర్సిటీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చామన్న కేసీఆర్.. ఫార్మా యూనివర్సిటీతో పాటు .. సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీలు రానున్నాయన్నారు. యూనివర్సిటీ నియామకాల కోసం రిక్రూట్ మెంట్ బోర్డు ఏర్పాటు కానుందని చెప్పారు. 111 జీవో ఎత్తేస్తూ నిర్ణయం కేబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. 2023 వరకు మరో 5 వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందన్నారు సీఎం కేసీఆర్.