CM Vijay Son: సీఎం విజయ్ కొడుకు వస్తున్నాడు.. జూలై 31కి రంగం సిద్ధం...

CM Vijay Son: సీఎం విజయ్ కొడుకు వస్తున్నాడు.. జూలై 31కి రంగం సిద్ధం...

తమిళ దళపతి, సీఎం విజయ్ కొడుకు జాసన్ సంజయ్ డైరెక్టర్గా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ స్టార్ సందీప్ కిషన్ హీరోగా విజయ్ కొడుకు తెరకెక్కిస్తున్న మూవీ ‘సిగ్మా’(SIGMA). ఇండియా బడా బ్యానర్ లైకా ప్రొడక్షన్స్ సినిమాను గ్రాండ్గా నిర్మిస్తుంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకోగా, తాజాగా రిలీజ్ డేట్‌ ప్రకటించారు మేకర్స్. 

యాక్షన్ అడ్వెంచర్ కామెడీగా తెరకెక్కుతున్న ‘సిగ్మా’ జూలై 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుందని తెలిపారు. ఈ మేరకు కొత్త పోస్టర్ రిలీజ్ చేసి ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ పెట్టారు. ‘‘భారీ పందెం కూడిన ఒక దోపిడీ మొదలైంది. సిగ్మా జూలై 31న థియేటర్లలోకి దండయాత్ర చేయనుంది. ఈ అద్భుత సాహసయాత్రకు సిద్ధంకండి’’ అని మేకర్స్ అంచనాలు పెంచారు.

రిలీజ్ పోస్టర్‌లో సందీప్ కిషన్ తీవ్ర ఆవేశంతో కనిపిస్తున్నాడు. రక్తపు మరకలతో ఉన్న గొయ్యిని తీసే భారీ పారను పట్టుకుని ఇంటెన్స్ లుక్‌లో నిలబడటం సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. గతంలో రిలీజైన పోస్టర్ కూడా సినిమా టోన్ చెప్పేసింది. ఇకపై ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్ రానున్నట్లు చిత్రబృందం తెలిపింది.

‘సిగ్మా’ టైటిల్ అర్ధం:

‘సిగ్మా’ అంటే ఒక ఫియర్‌లెస్ తోడేలు. అంటే, ఎవరితో సంబంధం లేకుండా, ఒక అండర్‌డాగ్‌లా వచ్చి, తన ఓన్ రూల్స్‌తో, భారీ టార్గెట్లను రీచ్ అయ్యే క్యారెక్టర్ అన్నమాట. సందీప్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా అదే అండర్ వరల్డ్ కథనాన్ని చూపిస్తుంది. డబ్బు కట్టలు, గోల్డ్ బార్లు, ఏనుగు దంతాలు.. ఇలా కోట్ల విలువైన డబ్బుల కట్టలు గుట్టగా పోసి వాటిపై సందీప్ కిషన్ కూర్చున్న తీరు ఆకట్టుకుంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా, పాన్-ఇండియా దృష్టిని ఆకర్షించే స్ట్రాంగ్ పాయింట్‌‌ ఉందని పోస్టర్ చూస్తే తెలుస్తోంది

స్పెషల్ రోల్స్..

ఈ చిత్రంలో ఫారియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తుండగా, కేథరిన్ స్పెషల్ సాంగ్‌‌లో అలరించనుంది. రాజు సుందరం, అన్బు థాసన్, సంపత్ రాజ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అలాగే  కొన్ని ప్రత్యేక అతిధి పాత్రలు ఉన్నాయని కూడా టాక్ వినిపిస్తోంది. స్టార్ హీరో విజయ్ కొడుకు అవ్వడంతో పెద్ద హీరోలే ఎంట్రీ ఇస్తారని సమాచారం. ఎస్. ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు.