ప్రతి గింజ కొంటామన్న కేసీఆర్ మోసం చేసిండు

ప్రతి గింజ కొంటామన్న కేసీఆర్ మోసం చేసిండు

వరి కొనుగోలు విషయంలో సీఎం కేసీఆర్ రైతుల దృష్టి మళ్లిస్తున్నారని ఆరోపించారు  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. తెలంగాణ రాష్ట్రంలో సమస్యలను సృష్టించే పార్టీ టీఆర్ఎస్ అని అన్నారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు భేటీ ఆయ్యారు. ఆ తర్వాత మాట్లాడిన బండి..జోనల్ వ్యవస్థతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. వరిధాన్యం కొనే దమ్ము కేసీఆర్ కు లేదని..పక్క రాష్ట్రాల్లో లేని సమస్య తెలంగాణలో ఎందుకు వస్తోందన్నారు. కేసీఆర్ రాష్ట్రంలో ఎవరికీ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదన్నారు. ప్రతి గింజ కొంటామన్న సీఎం మోసం చేశారన్నారు. కేసీఆర్ అవినీతి పై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

అంతేకాదు..తెలంగాణలోని పరిస్థుతులు, అణిచివేత, పాదయాత్ర, అక్రమ కేసుల గురించి అమిత్ షా దృష్టి కి తీసుకెళ్లామని తెలిపారు బండి సంజయ్. ఈటల రాజేందర్ భారీ మెజారిటీతో గెలుపొందడాన్ని అమిత్ షా అభినందించారని..ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతం కావడాన్ని సంతోషం వ్యక్తం చేశారన్నారు. తెలంగాణలో తమ పోరాటంపై అమిత్ షా సంతోషం వ్యక్తం చేశారన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర రెండో విడత వెంటనే ప్రారంభించాలని చెప్పిన అమిత్ షా.. రెండు రోజుల పాటు యాత్రలో పాల్గోంటానని హామీ ఇచ్చారన్నారు.

 

ప్రధాని ఫొటో తొలగించాలన్న పిటిషనర్కు లక్ష ఫైన్

ఎన్నికల చట్ట సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం