ఎన్నికల చట్ట సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

ఎన్నికల చట్ట సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

ఎన్నికల చట్ట సవరణ బిల్లు 2021కి రాజ్యసభ ఆమోదం లభించింది. ఈ బిల్లు సోమవారం లోక్సభలో పాస్ కాగా.. విపక్షాల ఆందోళనల మధ్య ఇవాళ పెద్దల సభ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆధార్తో ఓటర్ కార్డు అనుసంధానానికి మార్గం సుగమమైంది. రాజ్యసభలో బిల్లుపై చర్చ సందర్భంగా అధికార విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం సాగింది. సభలో బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు.. దేశంలో బోగస్ ఓట్ల నిర్మూలనకు ప్రత్యేక వ్యవస్థ ఏదీ లేదని, ఆధార్ తో ఓటర్ ఐడీని అనుసంధానించడం వల్ల అది సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. ఫేక్ ఓటర్లు మాత్రమే ఈ బిల్లును వ్యతిరేకిస్తారని, నిజమైన ఓటర్లు మద్దతు తెలుపుతారని అన్నారు. కాంగ్రెస్ ఎంపీలు మాత్రం ఆధార్ ఓటర్ ఐడీ లింకు బిల్లుపై చర్చకు మరింత సమయం కావాలని పట్టుబట్టారు. బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపాలంటూ ఓటింగ్ కు పట్టుబట్టారు. ఛైర్మన్ అందుకు అంగీకరించకపోవడంతో విపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం మూజువాణీ ఓటుతో ఎన్నికల చట్ట సవరణ బిల్లుకు రాజ్యసభ సభ్యులు ఆమోదం తెలిపారు. 

FOR MORE NEWS

స్టాండింగ్ కమిటీకి బాల్య వివాహ నిరోధక సవరణ బిల్లు

కేసీఆర్ కు కోమటిరెడ్డి హెచ్చరిక

పండుగల కంటే ప్రాణాలే ముఖ్యం