పండుగల కంటే ప్రాణాలే ముఖ్యం

పండుగల కంటే ప్రాణాలే ముఖ్యం

ఒమిక్రాన్ లాంటి కొత్త కొత్త వేరియంట్ల రూపంలో క‌రోనా మ‌హ‌మ్మారి ప్రపంచంలో క‌ల‌క‌లం సృష్టిస్తున్న స‌మ‌యంలో పండ‌గ‌ల వేళ‌ ఆంక్షలు తప్పని సరిగా విధించాలని  ప్రపంచ  ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధ‌న‌మ్ అన్నారు. ప్రపంచదేశాలన్ని  క‌ల‌సిక‌ట్టుగా క‌రోనా మ‌హమ్మారిని 2022 సంవత్సరంలో  అంతం చేయాలని, ఇందుకోసం అంద‌రూ క‌ఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వ‌స్తుంద‌ని తెలిపారు.

ప్రస్తుతం ఉన్న ఒమిక్రాన్ వేరియంట్ మిగ‌తా వేరియంట్ల క‌న్నా చాలా వేగంగా వ్యాపిస్తోందన్నారు టెడ్రోస్. దీంతో ప్రాణాలు పోగొట్టుకోవ‌డం క‌న్నా పండ‌గ‌లు చేసుకోక‌పోవ‌డం మంచిదన్నారు . అలాగే చాలా దేశాలలో ఇప్పటికీ జ‌నం మొద‌టి డోస్ కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. మ‌రోవైపు ధ‌నిక దేశాలు వ్యాక్సినేష‌న్ పూర్తి చేసుకుంటున్నాయన్నారు. ఈ ప‌రిస్థితి మారాలని..ప్రపంచమంతా సమాంత‌రంగా వ్యాక్సినేష‌న్ జ‌రిగితే మంచిదన్నారు టెడ్రోస్ అధ‌న‌మ్.