జాప్యం లేకుండా సీఎంపీఎఫ్ సేవలు : సీఎంపీఎఫ్ రీజినల్ కమిషనర్ హరిపచౌరి

జాప్యం లేకుండా సీఎంపీఎఫ్ సేవలు : సీఎంపీఎఫ్ రీజినల్ కమిషనర్ హరిపచౌరి

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణి ఉద్యోగులకు ఎలాంటి జాప్యం లేకుండా సీఎంపీఎఫ్​(కోల్​మైన్స్​ ప్రావిడెంట్​ ఫండ్​)ను త్వరగా చెల్లించడానికి కృషి చేయనున్నట్లు సీఎంపీఎఫ్​ రీజినల్ కమిషనర్​హరిపచౌరి తెలిపారు. మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఆఫీస్​లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎంపీఎఫ్​,పెన్షన్​కు సంబంధించిన లావాదేవీలన్ని సీ-కేర్స్​ పోర్టల్​ ద్వారా జరుగుతున్నాయని తెలిపారు.

 కొత్తగా సీఎంపీఎఫ్, పెన్షన్ కి సంబంధించిన క్లెయిమ్స్ త్వరగతిన పూర్తి చేయడానికి ప్రయాస్ సిస్టం తీసుకవచ్చామన్నారు.  బొగ్గు మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు జీరో పెండింగ్ గా సీఎంపీఎఫ్ పెన్షన్ సంబంధించిన క్లైములను సెటిల్ చేస్తున్నట్లు చెప్పారు. మందమర్రి ఏరియా సింగరేణి జీఎం జి.దేవేందర్​, ఏస్వోటుజీఎం విజయప్రసాద్​, సీఎంపీఎఫ్​ కమిషనర్ గోవర్ధన్​, పర్సనల్​ మేనేజర్​ శ్యాంసుందర్​, డీవైపీఎం బొంగోని శంకర్​గౌడ్​, సీఎంపీఎఫ్​ సిబ్బంది, వెల్ఫేర్​ ఆఫీసర్లు పాల్గొన్నారు.