తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘శ్రీ బాలాజీ ఆరోగ్య వరదాయిని’ పథకానికి సీఎంఆర్ షాపింగ్ మాల్ తెలంగాణ మేనేజింగ్ డైరెక్టర్ సత్యనారాయణ భారీ విరాళాన్ని అందజేశారు.
శనివారం తిరుమలలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరిని కలిసి రూ.10,01,116 విరాళానికి సంబంధించిన చెక్కును సమర్పించారు. ఈ సందర్భంగా ఈవో దాతలకు శ్రీవారి దర్శనం చేయించి తీర్థప్రసాదాలు అందించారు.
