సీఎంఆర్ త్వరగా అందించాలి.. లేట్ చేస్తే చర్యలు తీసుకుంటాం

సీఎంఆర్ త్వరగా అందించాలి.. లేట్ చేస్తే చర్యలు తీసుకుంటాం

వికారాబాద్, వెలుగు : జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) త్వరగా ప్రభుత్వానికి అందించాలని అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్ ఆదేశించారు. తమ మిల్లింగ్ కెపాసిటీ మేరకు వెంటనే ఎఫ్ సీఐకి అందించాలని మిల్లర్లకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ లో రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. సీఎంఆర్ ఇవ్వని మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

 ప్రతి రోజు సివిల్ సప్లయ్ అధికారి, డీటీసీఎస్ లు పర్యవేక్షిస్తారని, ప్రతి మిల్లరు గడువు తేదీలోగా పూర్తి చేయాలని, ఇది డిఫాల్టర్ రైస్ మిల్లర్లకు కూడా వర్తిస్తుందని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా సివిల్ సప్లయ్ అధికారి రాజేశ్వర్, డీఎంసీఎస్ సుగుణ బాయి, రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షుడు బాలేశ్వర్ గుప్త , శ్రీధర్ రెడ్డి, సెక్రటరీ, డీటీసీఎస్ లు, మిల్లర్లు పాల్గొన్నారు.