
సెమీ హైస్పీడ్ రైలు పనులు వేగవంతం చేసింది తమిళనాడు ప్రభుత్వం.. ఈ క్రమంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన బిడ్లను ఆహ్వానించి చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్(CMRL). గంటకు160 కి.మీల వేగంతో ప్రయాణించే సెమీ హైస్పీడ్ ప్రాజెక్టుకు 2025-26 బడ్జెట్ లో ప్రతిపాదనలు చేసింది.
ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని కీలక జిల్లాల మధ్య హైస్పీడ్ రైలు కనెక్టివిటీని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఢిల్లీ, మీరట్ మధ్య ఉన్న రీజనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (RRTS) తరహాలో ఈ కనెక్టివిటీ ఉండనుంది.
CMRL మూడు ప్రధాన కారిడార్లలో సాధ్యాసాధ్య అధ్యయనం(DFR) ,వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక(- DPR) కోసం బిడ్లను ఆహ్వానించింది.
- చెన్నై–చెంగల్పట్టు–తిండివనం–విల్లుపురం మధ్య 167 కి.మీ.ల మేర ఈ మార్గం చెన్నై దక్షిణ ప్రాంతంలో ముఖ్యమైన కనెక్టివిటీని అందిస్తుంది.
- చెన్నై–కంజీవరం–వెల్లూరు కారిడార్ లో చెన్నైని పశ్చిమ ప్రాంతంలోని 120 కి.మీ. వరకు ప్రధాన పట్టణాలకు కలుపుతుంది. CMRL ఈ కారిడార్‌లో పరంథూర్‌ను కూడా కలిపే అవకాశం ఉంది.
- కోయంబత్తూరు–తిరుప్పూర్–ఈరోడ్–సేలం కారిడార్ లో 185 కి.మీమేర పశ్చిమ తమిళనాడులో పారిశ్రామిక కేంద్రాలను కలుపుతుంది.
ఎంపిక చేసిన ప్రైవేటు ఏజెన్సీలు ప్రాజెక్టు వ్యయ అంచనాలు, స్టేషన్ల స్థానం, అంచనా వేసిన ప్రయాణికుల ట్రాఫిక్ పై సమగ్ర నివేదికను అందించనున్నాయి. ప్రాజెక్టుకు అవసరమైన నిధుల వనరులను గుర్తించడం, ప్రాజెక్టు దీర్ఘకాలిక నిర్వహణ ,ఆర్థిక ప్రయోజనాల అంచనా వంటి విషయాలపై సమగ్ర రిపోర్టును ఎంపిక చేయబడిన ప్రైవేట్ ఏజెన్సీలు CMRL కు అందించనున్నాయి.
ఈ రిపోర్టులను CMRL సమీక్షించి అవసరమైన సవరణల తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. తమిళనాడు ప్రభుత్వం ఈ ప్రాజెక్టు అమలుకు ప్రపంచ బ్యాంకు ,కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం కోరే అవకాశం ఉంది.
►ALSO READ | సీఎం సీటు ఖాళీ లేదు.. ఐదేళ్లు నేనే కూర్చుంటా: ముఖ్యమంత్రి మార్పుపై సిద్ధరామయ్య క్లారిటీ
కొన్ని కారిడార్లకు సంబంధించిన కన్సల్టెన్సీ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. చెన్నై-చెంగల్పట్టు-తిండివనం-విల్లుపురం కారిడార్‌కు సంబంధించిన సాధ్యాసాధ్య అధ్యయనం కోసం M/s బాలజీ రైల్‌రోడ్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కాంట్రాక్టు పొందింది. ఈ ప్రాజెక్టులు తమిళనాడులో ప్రజా రవాణాను విప్లవాత్మకంగా మారుస్తాయని, ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తాయని ,రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తాయని భావిస్తున్నారు.