కేంద్రం గుడ్‌న్యూస్‌.. తగ్గిన సీఎన్‌జీ ధరలు

కేంద్రం గుడ్‌న్యూస్‌.. తగ్గిన సీఎన్‌జీ ధరలు

దేశంలో సీఎన్‌జీ ధరలు తగ్గాయి. తగ్గిన ధరలు ఏప్రిల్ 09 ఆదివారం నుంచి ఆమల్లోకి వచ్చాయి. కిలో సీఎన్జీపై రూ.4 తగ్గిస్తూ ఇంద్రప్రస్థ గ్యాస్‌ లిమిటెడ్‌ (IGL) నిర్ణయం తీసుకున్నది.  ఇవాళ్టి ధరల ప్రకారం ఢిల్లీలో రూ.  73.59 ఉన్న ధర ఒక్కసారిగా రూ. 4 కి తగ్గి రూ.73.59కి చేరుకుంది. నోయిడా, గ్రేటర్ నోయిడా. ఘజియాబాద్‌లలో రూ. 82.12గా ఉంది.  

ఇక గురుగ్రామ్‌లో రూ.82.62గా ఉన్నది. గతేడాది డిసెంబర్‌ 17న ఢిల్లీలో సీఎన్జీ ధరలు పెరిగాయి. అప్పటి నుంచి ధరల్లో తగ్గుదల రావడం ఇదే మొదటిసారి. అంతకుముందు మేలో రెండు రూపాయలు పెంచగా, అక్టోబర్ 8న మూడు రూపాయలు పెరిగింది.  

సీఎన్జీతోపాటు గృహావసరాలకు వినియోగించే పైపుడ్ నేచురల్‌ గ్యాస్‌ (PNG) ధరను కూడా ఐజీఎల్‌ తగ్గించింది. ఢిల్లీలో ఇప్పటివరకు కిలో పీఎన్‌జీకి రూ.53.59గా ఉన్న ధర రూ.48.59కి దిగివచ్చింది. రానున్న రోజుల్లో సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరలు మరింత తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.