రానున్న క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బజాజ్‌‌‌‌‌‌‌‌ సీఎన్‌‌‌‌‌‌‌‌జీ బైక్‌‌‌‌‌‌‌‌

రానున్న క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బజాజ్‌‌‌‌‌‌‌‌ సీఎన్‌‌‌‌‌‌‌‌జీ బైక్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: ఇప్పటి వరకు కంప్రెస్డ్‌‌‌‌‌‌‌‌ నేచురల్ గ్యాస్ (సీఎన్‌‌‌‌‌‌‌‌జీ)  ఆటోలు, కార్లు చూసుంటాం. కానీ, సీఎన్‌‌‌‌‌‌‌‌జీ మోటార్ బైక్స్‌‌‌‌‌‌‌‌ కూడా మార్కెట్‌‌‌‌‌‌‌‌లో ఎంట్రీ ఇవ్వనున్నాయి. అనుకున్నదానికంటే ముందుగానే సీఎన్‌‌‌‌‌‌‌‌టీ బైక్‌‌‌‌‌‌‌‌లను బజాజ్‌‌‌‌‌‌‌‌ ఆటో లాంచ్ చేయనుంది. కంపెనీ ఎండీ రాజీవ్ బజాజ్‌‌‌‌‌‌‌‌ రానున్న క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే సీఎన్‌‌‌‌‌‌‌‌జీ బైక్‌‌‌‌‌‌‌‌లను లాంచ్ చేస్తామన్నారు.  మొదట 2025 లో లాంచ్ చేయాలని ప్లాన్ చేశారు.

3తాజాగా సీఎన్‌‌‌‌‌‌‌‌బీసీ –టీవీ18 కి ఇచ్చిన ఇంటర్వ్యూలో  ఈ అంశంపై ఆయన మాట్లాడారు.  సీఎన్‌‌‌‌‌‌‌‌జీ బైక్స్‌‌‌‌‌‌‌‌తో  ఫ్యూయల్‌‌‌‌‌‌‌‌, ఆపరేటింగ్ ఖర్చులు సగానికి పైగా తగ్గుతాయన్నారు. టెస్టింగ్ మంచి ఫలితాలను ఇచ్చిందని పేర్కొన్నారు. పెట్రోల్‌‌‌‌‌‌‌‌ బైక్‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే   సీఎన్‌‌‌‌‌‌‌‌జీ బైక్ ప్రోటోటైప్‌‌‌‌‌‌‌‌తో 50 శాతం  సీఓ2, 75 శాతం కార్బన్ మోనాక్సైడ్‌‌‌‌‌‌‌‌, 90 శాతం నాన్ మిథేన్‌‌‌‌‌‌‌‌ ఎమిషన్స్‌‌‌‌‌‌‌‌ తగ్గాయని వివరించారు.