ఇండిగోలో వాటా అమ్మనున్న రాకేష్​ గంగ్వాల్​..

ఇండిగోలో వాటా అమ్మనున్న రాకేష్​ గంగ్వాల్​..
  • జులై 15 తర్వాత బ్లాక్​డీల్స్​

ముంబై: ఇండిగో ఎయిర్​లైన్స్​లో తమకున్న వాటాలో 5 నుంచి 8 శాతం దాకా అమ్మాలని కో–ఫౌండర్​ రాకేష్​ గంగ్వాల్​ ఫ్యామిలీ ప్లాన్​ చేస్తోంది. ఇండిగో ఎయిర్​లైన్స్​ను నడిపే పేరెంట్​ కంపెనీ ఇంటర్​గ్లోబ్​ఏవియేషన్​ లిమిటెడ్​లో ఈ వాటా విలువ రూ. 7,500 కోట్లకు సమానమవుతుంది. వాటా అమ్మకం మీద సీఎన్​బీసీ ఆవాజ్​ ఒక కథనాన్ని ప్రసారం చేసింది. ఇండిగోలో రాకేష్​ గంగ్వాల్​కు 13.23 శాతం, ఆయన భార్య శోభ గంగ్వాల్​కు 2.99 శాతం వాటాలు ఉన్నాయి.   వారి ఫ్యామిలీ ట్రస్ట్​ చింకెర్​పూ ఫ్యామిలీ ట్రస్ట్​కు మరో 13.5 శాతం వాటా ఉంది. జులై 15న  లాక్​ ఇన్​ ముగిసిన తర్వాత బ్లాక్​ డీల్స్​ ద్వారా వాటాలను అమ్మాలనేది గంగ్వాల్​ ఫ్యామిలీ ఆలోచనగా సీఎన్​బీసీ ఆవాజ్​   వెల్లడించింది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో శోభ  ​ 4 శాతం వాటా అమ్మారు. తాజా షేర్ల అమ్మకంపై మాట్లాడేందుకు ఇంటర్​గ్లోబ్​ ఏవియేషన్​, గంగ్వాల్​ ఫ్యామిలీ తో మాట్లాడేందుకు  రాయిటర్స్​ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఫిబ్రవరి 2022లో కో–ఫౌండర్​ రాకేష్​ గంగ్వాల్​ డైరెక్టర్ల బోర్డు నుంచి తప్పుకున్నారు. అయిదేళ్ల కాలంలో తన వాటా మొత్తాన్ని తగ్గించుకోనున్నట్లు అప్పుడే ఆయన వెల్లడించారు. 2006 లో రాహుల్​ భాటియా, రాకేష్​ గంగ్వాల్​లు కలిసి ఇండిగోను ఏర్పాటు చేశారు. 2020 లో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా 19 శాతం పెరిగిన ఇండిగో షేర్లు గంగ్వాల్​ షేర్ల అమ్మకం వార్తలతో 3.1 శాతం పడ్డాయి.