కొవిన్ పోర్టల్లో రెండు కొత్త అప్డేట్లు

కొవిన్ పోర్టల్లో రెండు కొత్త అప్డేట్లు

న్యూఢిల్లీ‌‌‌‌: కొవిన్  పోర్టల్ లో తాజాగా రెండు కొత్త అప్ డేట్లు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో ఇప్పటివరకు ఒక మొబైల్  నంబరుతో నలుగురికి మాత్రమే రిజిస్ట్రేషన్ కు అవకాశం ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్యను ఆరుకు పెంచింది. దీంతోపాటు కొవిన్  అకౌంట్ లో ‘రైజ్ ఎన్ ఇష్యూ’ ఆప్షన్ లో ‘రివోక్  వ్యాక్సినేషన్ ’ అని కొత్త సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్  ద్వారా వ్యాక్సినేషన్  స్టేటస్ ను మార్చుకోవచ్చు. వ్యాక్సినేటెడ్  నుంచి పార్శియల్లీకి లేదా అన్ వ్యాక్సినేటెడ్ కు మార్చుకోవచ్చు. పార్శియల్లీ నుంచి అన్ వ్యాక్సినేటెడ్ కూ మార్చుకోవచ్చు. టీకా స్టేటస్ ను అప్ డేట్ చేసేప్పుడు అనుకోకుండా తప్పు చేస్తే.. సరిదిద్దుకునేందుకు ఉపయోగపడుతుంది. కొత్త స్టేటస్ అప్ డేట్ అయ్యేందుకు 3–7 రోజులు సమయం పడుతుందని అధికారులు తెలిపారు. వ్యాక్సినేషన్ స్టేటస్ అప్ డేట్ అయ్యాక.. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం టీకా డోసులు పొందొచ్చు. 

విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు సంబంధించిన ఐసోలేషన్ నిబంధననూ కేంద్రం సవరించింది. భారత్ కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికుల్లో ఎవరికైనా కొవిడ్ పాజిటివ్ గా తేలితే.. ఇకపై వారు నిర్దేశించిన ఐసోలేషన్ కేంద్రంలో ఉండటం తప్పనిసరి కాదని అధికార వర్గాలు తెలిపాయి. కరోనా ప్రోటోకాల్ అనుసరిస్తే సరిపోతుందని కేంద్రం తెలిపింది. ఈ నిబంధనలు నేటి నుంచి తర్వాతి ఉత్తర్వులు వచ్చే వరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. మిగిలిన నిబంధనల్లో ఎలాంటి మార్పు లేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. 

మరిన్ని వార్తల కోసం:

మాజీ ప్రధానికి కరోనా పాజిటివ్

బీజేపీ తప్ప.. ఏ పార్టీతోనైనా పొత్తుకు రెడీ

చూపే బంగారమాయెనే శ్రీవల్లి అంటున్న డేవిడ్ భాయ్