మాజీ ప్రధానికి కరోనా పాజిటివ్

మాజీ ప్రధానికి కరోనా పాజిటివ్

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీలు, రాజకీయ ప్రముఖుల వరకూ ఎవరినీ వదలడం లేదు. గతంలో కంటే థర్డ్ వేవ్ లో భారీ సంఖ్యలో ప్రముఖులు కరోనా బారినపడుతున్నారు. ఇవాళ తాజాగా దేశ మాజీ ప్రధాని, జనతా దళ్ (సెక్యులర్) పార్టీ అధ్యక్షుడు హెచ్.డి.దేవెగౌడ (88)కు కరోనా సోకింది. ఈ విషయాన్ని దేవెగౌడ కార్యాలయం ప్రకటించింది. దేవెగౌడకు కరోనా పాజిటివ్ వచ్చిందని, అయితే ఆయనకు ఎటువంటి సింప్టమ్స్ లేవని తెలిపింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిమితంగా ఉందని పేర్కొంది.

కాగా, దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు 3 లక్షల 37 వేల 704 కేసులు నమోదయ్యాయి. మరో 488 మంది మరణించారు. అయితే నిన్నటితో పోలిస్తే కొత్తగా నమోదైన కేసులు 9,550 తక్కువగా ఉండడం కొంత ఊరట కలిగిస్తోంది. అలాగే గడిచిన 24 గంటల్లో 2 లక్షల 42 వేల 676 మంది కోలుకున్నట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో 17.22 శాతం పాజిటివిటీ రేటు ఉందన్నారు అధికారులు. మొత్తం 21 లక్షల 13 వేల 365 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 10 వేల 050 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. నిన్నటితో పోలిస్తే ఒమిక్రాన్ కేసులు 3.69 శాతం పెరిగాయి.

మరిన్ని వార్తల కోసం..

మధ్యప్రదేశ్ లో 19 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్