దశాబ్దాల లాక్‌డౌన్‌ నుంచి కోల్ సెక్టార్‌‌ బయటపడింది: మోడీ

దశాబ్దాల లాక్‌డౌన్‌ నుంచి కోల్ సెక్టార్‌‌ బయటపడింది: మోడీ

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా పతనమైన దేశ ఆర్థిక వ్యవస్థకు బూస్టప్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఆత్మ భారత్ నిర్భర్‌‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ చర్యల్లో భాగంగా కమర్షియల్ మైనింగ్ కోసం 41 బొగ్గు గనుల వేలంపాటను గురువారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా కోల్ మైనింగ్ గురించి ప్రధాని పలు విషయాలు మాట్లాడారు. దశాబ్దాల లాక్‌డౌన్ నుంచి కోల్ సెక్టార్ బయటపడిందన్నారు. ‘విషయం బొగ్గుకు సంబంధించినది.. కానీ దేశం వజ్ర కలలు కంటోంది. ఇంధనం విషయంలో ఇండియాను స్వావలంబన దిశగా నడపడానికి ఇదో పెద్ద అడుగు. ప్రతి వాటాదారునికి కమర్షియల్ కోల్ మైనింగ్ ఆక్షన్ అనేది తప్పక నెగ్గాల్సిన పరిస్థితి లాంటిది. ఇప్పుడు బొగ్గుకు మార్కెట్‌ తెరిచి ఉంది. ఇది అన్ని రంగాలకు దోహదపడుతుంది’ అని మోడీ చెప్పారు. ఇప్పుడు ఇండస్ట్రీలు తమ వ్యాపారాలు, పెట్టుబడులకు కొత్త వనరులు, మార్కెట్‌ను పొందుతాయని మోడీ పేర్కొన్నారు. విద్యుత్, ఉక్కు, అల్యూమినియం వంటి అనేక బేసిక్ ఇండస్ట్రీస్‌కు మైనింగ్ చాలా కీలకమైన వనరు అని వివరించారు. కమర్షియల్ మైనింగ్‌ విస్తరించడం వల్ల ఈ రంగంలో ప్రైవేటురంగ భాగస్వామ్యం పెరుగుతుందని భావిస్తున్నారు. దీని వల్ల ప్రొడక్షన్ పెరగడంతోపాటు పోటీతత్వం కూడా ఎక్కువవుతుందని అంచనా వేస్తున్నారు.