Varalaxmi Sarathkumar: వరలక్ష్మీకి కళ్లు చెదిరే గిప్ట్ ఇచ్చిన నికోలాయ్.. ఖరీదు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Varalaxmi Sarathkumar: వరలక్ష్మీకి కళ్లు చెదిరే గిప్ట్ ఇచ్చిన నికోలాయ్.. ఖరీదు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ప్రముఖ తమిళ నటుడు శరత్ కుమార్ గారాల కూతురు వరలక్ష్మీ శరత్ కుమార్.  తన నటనతో తమిళం, తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. తొలుత హీరోయిన్ గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది.  కానీ అంతగా అదృష్టం కలిసి రాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది.  పాత్ర ఏదైనా ఇట్టే అవలీలగా చేస్తుంది. విలనీ తరహా పాత్రలతో ప్రేక్షకుల మన్ననలు పొందింది.  ఇప్పుడు ఈ భామ సోషల్ మీడియా సోషల్ మీడియాలో ట్రెండ్ లో ఉంది. 

గతేడాది అందరికి షాక్ ఇస్తూ ముంబైకి చెంది గ్యాలరీస్ట్ నికోలయ్ సచ్ దేవ్ ను పెళ్లి చేసుకుంది వరలక్ష్మీ. ఈ జంట పెళ్లై ఏడాది పూర్తి చేసుకుంది. తాజాగా ఈ జంట తమ తొలి వార్షికోత్సవాన్ని  సెలబ్రేట్ చేసుకుంది. ఈ క్రమంలో ముంబైలో ఉన్న నికోలయ్ చైన్నైలో ఉన్న వరలక్ష్మీకి సర్ ప్రైజ్ ఇచ్చారు. ఖరీదైన పోర్సే కారును బహుమతిగా ఇచ్చారు.  ఈ పోర్సే 718 బాక్స్ టర్ మోడల్ గులాబి రంగులో మెరిసిపోతుంది. ఇంకేముంది వరలక్ష్మీ ఆనందానికి హద్దులు లేదు.

 

తన భర్త నికోలయ్ కు థ్యాంక్స్ చెబుతూ.. పోర్సే కారులో చెన్నైలో షికారు చేసింది.  ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంది.  ఈ కారు మన ఇండియలో దాదాపు రూ. కోటి 80 లక్షలకు పైగానే ఉంది.  అమ్మో ఇంత కారు గిప్ట్ ఇచ్చారా మీ భర్త అంటూ నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు. ఏమైనా నీవు అదృష్టవంతురాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తుంది. పెళ్లైన తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ కెరీర్ పరంగా దూసుకెళ్తోంది.

Also Read : 'శుభం' హిట్ తర్వాత సమంత దూకుడు