Samantha: 'శుభం' హిట్ తర్వాత సమంత దూకుడు.. సొంత బ్యానర్‌పై మరో కొత్త సినిమా!

Samantha: 'శుభం' హిట్ తర్వాత సమంత దూకుడు..  సొంత బ్యానర్‌పై మరో కొత్త సినిమా!

టాలీవుడ్ అగ్రతార సమంత ( Samantha ) తన కెరీర్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది.  కొంత కాలంగా తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ భామ పూర్తిగా రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. నటిగానే కాదు, నిర్మాతగా కూడా తన ప్రూవ్ చేసుకోనేందుకు రెడీ అవుతున్నారు.  ఇటీవల విడుదలైన హారర్ కామెడీ చిత్రం 'శుభం' (  Subham  ) తో నిర్మాతగా తొలి అడుగువేసింది. అందులో ఓ చిన్న అతిథి పాత్రలో మెరిసింది. ఈ చిత్రం OTT స్ట్రీమింగ్ లో హిట్ కావడంతో ఇప్పుడు మరింత దూకుడు పెంచి ముందుకు సాగేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది.

తన సొంత నిర్మాణ సంస్థ లాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై ఒక న్యూఏజ్ సోషల్ డ్రామా చిత్రాన్ని నిర్మించడమే కాకుండా  అందులో ప్రధాన పాత్రలో సమంత నటించనుంది . ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహించనున్నారని సమాచారం.   ప్రస్తుతం ఈ మూవీ సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నాయి. ఒక అర్థవంతమైన కథనానికి ప్రాధాన్యత ఇస్తూ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే  అవకాశం ఉంది.  గతంలో వీరిద్దరి కాంబోలో ఓ సినిమా రాబోతుందని వార్తలు వచ్చినప్పటికీ వాటిని కొట్టిపారేశారు. కానీ ఇప్పుడు పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చిందని త్వరలోనే అధికారిక ప్రకటను రానుందని సినీ వర్గాలు పేర్కొన్నారు.

►ALSO READ | Kantara 2: రిషబ్ శెట్టి 'కాంతార: చాప్టర్ 1' - ప్రీక్వెల్ సృష్టిస్తున్న అంచనాలు, విడుదల తేదీ ఖరారు!

విజయ్ దేవరకొండతో కలిసి 2023 ఖుషిలో నటించారు. ఆతర్వాత ఆమె బాలీవుడ్ పై దృష్టి పెట్టింది. వెబ్ సిరీస్  'సిటాడెల్; హనీ బన్నీ'  లో నటించింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సీరిస్ ఆశించినంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.  ప్రస్తుతం సమంత 'ఫ్యామిలీ మ్యాన్' సృష్టికర్తలు రాజ్, డికే దర్శకత్వంలో మరో హిందీ వెబ్ సిరీస్, రక్త్ బ్రహ్మాండ్ ది బ్లడ్  కింగ్ డమ్ లో సమంత నటిస్తోంది.  'ఏ మాయ చేసావే' తో తెలుగుతెరకు పరిచయం అయ్యారు.  నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత ఒంటరిగా ఉంటుంది. అయితే  బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరుతో ప్రేమలో ఉందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని జోరుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ జంట ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ పుకార్లపై వీరిద్దరూ ఇంతవరకు స్పందించలేదు.