Kantara 2: రిషబ్ శెట్టి 'కాంతార: చాప్టర్ 1' - ప్రీక్వెల్ సృష్టిస్తున్న అంచనాలు, విడుదల తేదీ ఖరారు!

Kantara 2: రిషబ్ శెట్టి 'కాంతార: చాప్టర్ 1' - ప్రీక్వెల్ సృష్టిస్తున్న అంచనాలు, విడుదల తేదీ ఖరారు!

రిషబ్ శెట్టి ( ) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ' కాంతార : చాప్టర్ 1 ( )  ' .  ఇది గత 'కాంతార' మూవీకి ప్రీక్వేల్ గా వస్తున్న   సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి.  'కేజీఎఫ్', 'సలార్', 'కాంతార' వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలను నిర్మించిన  హోంబాలే ఫిల్మ్స్ ఈ మూవీపై కొత్త అప్డేట్ ను అందించింది. సినీ ప్రియులను శుభవార్త చెప్పింది. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా ' కాంతార : చాప్టర్ 1' విడుదల కానుందని తెలిపింది.  ఈ చిత్రం తమ గత చిత్రాలన్నింటిలోకెల్లా అత్యంత శక్తివంతమైనదిగా అభివర్ణించింది.  

స్వీయ దర్శకత్వంలో రిషబ్ శెట్టి హీరోగా భారీ బడ్జెట్ తో ఈ ' కాంతార : చాప్టర్ 1 ' రూపుదిద్దుకుంది. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మాణ సంస్థ ' బిహైండ్ దిసీన్స్" ( BTS  ) వీడియోను విడుదల చేసింది.  ఈ వీడియోలో ' కాంతార : చాప్టర్ 1' కోసం  మూవీ టీం శ్రమ, తెర వెనుక వారి కృషి స్పష్టంగా చూపించింది. ఈ చిత్రం కోసం దాదాపు 250 రోజుల పాటు నిర్విరామంగా సాగిన షూటింగ్, మూడేళ్ల నిరంతర అంకితభావాన్ని తెలియజేస్తుంది.  వేలాది మంది టెక్నీషియన్లు, కళాకారులు అహర్నిశలు శ్రమించి ఈ కలను నిజం చేశారు. ముఖ్యంగా, నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి ఈ ప్రాజెక్ట్ పట్ల చూపిన నిబద్ధత, ఆయన అసాధారణమైన నైపుణ్యం ఈ మేకింగ్ వీడియోలో హైలైట్ అయ్యాయి. ప్రతీ ఫ్రేమ్‌ను ఆయన ఎంత శ్రద్ధగా తీర్చిదిద్దారో ఈ వీడియో ద్వారా స్పష్టమవుతుందని అభిమానులు కొనియాడుతున్నారు.

►ALSO READ | ఆ రోజు విచారణకు రాలేను..ఈడీని సమయం కోరిన రానా

"కాంతార: చాప్టర్ 1' షూటింగ్ అంతా మా టీం అందరికి ఒక దైవిక ప్రయాణంలా సాగిందని రిషల్ శెట్టి అన్నారు.  మన సంస్కృతిలో లోతుగా పాతుకుపోయిన ఈ కథకు, అచంచలమైన అంకితభావం, అవిశ్రాంతమైన కృషి, అద్భుతమైన టీమ్ స్పిరిట్‌తో ప్రాణం పోశాం. ఈ పౌరాణిక గాథ ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 2న పెద్ద తెరలపై ఆవిష్కృతమవుతుందని తెలిపారు. మీ అందరినీ థియేటర్లలో చూడటానికి ఎంతో ఆతృతగా ఉన్నాను అని చెప్పారు.

 

నిర్మాత విజయ్ కిరగందూర్ మాట్లాడుతూ "కాంతార: చాప్టర్ 1 అనేక విధాలుగా మాకు అతిపెద్ద ప్రాజెక్ట్.  ఇది మా గత ప్రాజెక్టుల కంటే పెద్దది. ఎక్కువ రోజుల షూటింగ్ తో పాటు ఇంత పెద్ద బృందంతో పనిచేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఇది మాకు అత్యంత ప్రతిష్టాత్మకమైన వెంచర్ అన్ని అన్నారు. తమ హోంబాలే ఫిల్మ్స్ ఎప్పుడూ నాణ్యతకు, కొత్తదనానికి పెద్ద పీట వేస్తుందనడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఈ మూవీకి  సంగీత  బి. అజనీష్ లోక్‌నాథ్ అందించగా సినిమాటోగ్రాఫర్ అరవింద్ కశ్యప్, ప్రొడక్షన్ డిజైనర్ గా వినీష్ బంగాళన్ వ్యవహారించారు.