
ప్రపంచ వ్యా్ప్తంగా ఎక్కువ జనాభా కలిగిన దేశాల్లో అగ్రగామిగా ఉన్న భారతదేశంలో ఊబకాయుల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరిగిపోతోంది. మారుతున్న ఆహారపు, జీవశైలి అవలాట్లతో అధిక బరువు సమస్యను ఎదుర్కొంటున్న భారతీయుల సంఖ్య టీనేజర్ల నుంచి ఓల్డేజర్ల వరకు పెరిగిపోయిందని ఇప్పటికే పలు అధ్యయనాల రిపోర్టులు నిర్థారించాయి.
ఈ క్రమంలోనే భారత్ ప్రపంచ వెయిట్ మ్యానేజ్మెంట్ దిగ్గజ సంస్థలు ప్రస్తుతం భారత మార్కెట్ పై తమ దృష్టిని కేంద్రీకరిస్తున్నాయి. ఇండియన్ మార్కెట్ కొత్త స్థూలకాయ నిరోధక మందులకు ముఖ్యమైన మార్కెట్‌గా.. అలాగే సదరు మందుల సరసమైన జనరిక్ వెర్షన్‌ల ఉత్పత్తికి అభివృద్ధి చెందుతున్న కేంద్రంగా మారిపోయింది. పరిశ్రమను పెరుగుతున్న ఊబకాయుల సంఖ్య దేశంలో విస్తరించేలా చేస్తోంది. దీనికి ప్రభుత్వ ప్రోత్సాహకాలు తోడు కావటం విదేశీ సంస్థలను ఎక్కువగా భారతదేశానికి వచ్చేల్లా ప్రోత్సహిస్తోంది.
ప్రపంచ ప్రఖ్యాత ఫార్మా కంపెనీలైన నోవో నోర్డిస్క్ ఇటీవల తన విగోవీని లాంచ్ చేయగా.. దీనికి ముందు వచ్చిన ఇలి లిల్లీ ఉత్పత్తి మౌన్జారోతో పోటీపడుతోంది. ఇదే క్రమంలో దేశీయ దిగ్గజ ఫార్మా కంపెనీలైన డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, సిప్లా, బయోకాన్, లుపిన్ వంటి సంస్థలు ఇప్పటికే తమ సొంత జనరిక్ వేరియంట్లను సిద్ధం చేసుకుంటున్నాయి. 2026 నాటికి విదేశీ సంస్థల పేటెంట్ల కాలం ముగియనున్న నేపథ్యంలో అప్పటికి తమ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావాలని ఇండియన్ ఫార్మా దిగ్గజాలు చూస్తున్నాయి.
భారత మార్కెట్లలో ఉన్న పేషెంట్ల సంఖ్యతో పాటు పెద్ద వ్యాపార అవకాశాన్ని క్యాష్ చేసుకోవాలని ప్రపంచ ఫార్మా దిగ్గజాలు చూస్తున్నాయి. అందుకే తమ అడ్వాన్స్డ్ యాంటీ ఒబెసిటీ మందులను వేగంగా ఇక్కడి మార్కట్లోకి లాంచ్ చేస్తున్నాయని తేలింది. మార్చి నుంచి మే అంటే మూడు నెలల కాలంలోనే మౌన్జారో మందు అమ్మకాలు దేశంలో రూ.24 కోట్ల టర్నోవర్ సాధించిందని ఫార్మా ర్యాక్ డేటా ప్రకారం వెల్లడైంది. అయితే ప్రస్తుతం ఈ అమ్మకాలు జూన్ ఒక్క నెలలోనే రెండితలై రూ.50 కోట్ల వ్యాపారాన్ని సాధించింది.
►ALSO READ | భారత ఆర్థిక వ్యవస్థను తొక్కేస్తాడంట వీడు.. : అమెరికా సెనేటర్ బలుపు మాటలు చూడండి..!
దేశంలోని మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలే టార్గెట్ గా విదేశీ ఫార్మా కంపెనీలు ముందుకు సాగుతున్నాయి. ఈ మందుల డోసేజ్ విలువ నెలకు రూ.14వేల నుంచి రూ.17వేల 500 వరకు భరించగలిగే స్థాయిలో ఉండటంతో ఫార్మా కంపెనీలకు కాసుల వర్షం కురుస్తోంది. అందుకే మౌన్జారో లాంటి మందుల కొనుగోళ్లు వేగంగా పెరుగుతున్నట్లు తేలింది. ప్రజల ఆలోచనలో మార్పులు ముందస్తు రోగాలను నిరోధించేందుకు ప్రాధాన్యతలు యాంటీ ఒబెసిటీ మందుల అమ్మకాలను వేగంగా పెంచేస్తున్నాయి.
త్వరలోనే వెయిట్ మేనేజ్మెంట్ ఔషదాల పేటెంట్స్ కాలం ముగియటానికి దగ్గరపడిన వేళ వీటి జనరిక్ వేరియంట్లు భారత మార్కెట్లో సునామీలా లాంచ్ అవ్వటానికి మరో పక్క రెడీ అవుతున్నాయి. ఇదే జరిగితే బరువు తగ్గించే మందులతో పాటు డయాబెటిక్ మందులు సరసమైన ధరలకు భారతీయులకు అందుబాటులోకి వస్తాయని నిపుణులు చెబుతున్నారు.