సూది లేకుండా వ్యాక్సిన్ వేసిన రోబో

సూది లేకుండా వ్యాక్సిన్ వేసిన రోబో

అ తిపెద్ద జనాభా గల చైనా, ఇండియా లాంటి దేశాల్లో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్​వేయాలంటే పెద్ద సంఖ్యలో హెల్త్​వర్కర్లు కావాల్సి ఉంటుంది. అలాంటి సమస్యకు చెక్​పెట్టేలా కెనడాకు చెందిన కోబయోనిక్స్​అనే స్టార్టప్​కంపెనీ నీడిల్​లెస్​ ఇంజెక్షన్​తో వ్యాక్సిన్ ​వేసే ‘కోబి’ అనే రోబోను తయారు చేసింది. తాజాగా ఆ రోబో సూది లేకుండా వ్యాక్సిన్ వేసి ప్రపంచ గుర్తింపు పొందింది. 

మెకానికల్​ఇంజనీర్స్​ఘనత

కెనడాలోని ప్రఖ్యాత వాటర్​లూ యూనివర్సిటీలో లాస్​వెల్, జమని అనే ఇద్దరు మెకానికల్​ఇంజనీరింగ్​పూర్తి చేశారు. ప్రపంచానికి ఉపయోగపడే ఆవిష్కరణలు చేయాలనుకున్న ఈ ఇద్దరు. 2019లో కోబయోనిక్స్​అనే స్టార్టప్​ప్రారంభించారు. దీని ద్వారా రోబోలు తయారు చేయడం ప్రారంభించారు. ఇప్పటికే వివిధ పనులు చేసే రోబోలు ఆవిష్కరించిన వీరు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో వ్యాక్సిన్​వేసే ‘కోబి’ అనే రోబో తయారు చేసి విజయం సాధించారు. కోబి రోబో వల్ల ఆరోగ్య రంగంలో హెల్త్​ వర్కర్ల కొరత తీరడంతోపాటు, ఎఫీషియన్సీ సేవలు అందుతాయని, టైం కలిసి వస్తుందని కోబయోనిక్స్​కోఫౌండర్స్​లాస్ వెల్, జమని తెలిపారు.

ఎలా పని చేస్తుందంటే..

వ్యాక్సిన్ కోసం ఆన్‌లైన్‌లో ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారు సంబంధిత హెల్త్​క్యాంప్​లొకేషన్‌కి వెళ్లాలి. రోబోకు ఉన్న టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే ముందు రిజిస్ట్రేషన్​చూపితే అది వ్యక్తి ఐడెంటిటీ చెక్​ చేస్తుంది. తర్వాత మల్టిపుల్ త్రీడీ డెప్త్ సెన్సర్లతో వ్యక్తిని స్కాన్​చేస్తుంది. ఎక్కడ ఇంజక్షన్​ చేయాలో.. సరైన్​స్పాట్​ను డిస్​ప్లేతో చూపుతుంది. ఆ యాంగిల్​లో వ్యక్తి నిలబడగానే టీకా తీసుకొని స్కిన్​పై హై ప్రెజర్ తో వ్యాక్సిన్​వేస్తుంది. మనిషి వెంట్రుక సైజు గల రంధ్రం ద్వారా వ్యాక్సిన్​ వ్యక్తి శరీరంలోకి వెళ్తుంది.