‘రాజన్న’ ధర్మసత్రంలో నాగుపాము ప్రత్యక్షం

‘రాజన్న’ ధర్మసత్రంలో నాగుపాము ప్రత్యక్షం

వేములవాడ, వెలుగు: వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పరిధిలోని పార్వతిపురం వసతి గదిలో గురువారం నాగుపాము ప్రత్యక్షమైంది. ఆలయ అధికారులు 13 A వసతి గదిని డ్యూటీ పోలీసులకు కేటాయించారు. కాగా దాని ముందు రూమ్‌‌‌‌లో నాగుపాము ప్రత్యక్షం కావడంతో స్నేక్ క్యాచర్ జగదీశ్‌‌‌‌కు సమాచారం ఇచ్చారు. అతడు అక్కడికి చేరుకొని పామును పట్టి శివారులోని నిర్మానుష్య ప్రాంతంలో వదిలిపెట్టాడు.