వెలుగు ఓపెన్ పేజీ.. అజెండా, నినాదం.. కాక్రోచ్ జనతా పార్టీ

వెలుగు ఓపెన్ పేజీ.. అజెండా, నినాదం.. కాక్రోచ్ జనతా  పార్టీ

కాక్రోచ్​ జనతా  పార్టీ  వ్యవస్థాపకుడు దీనిలో చేరేవాళ్ళు నిరుద్యోగులుగా, పదకొండు గంటలు మొబైల్ చూస్తూ, సామాజిక సమస్యల పట్ల స్పందించటం లాంటి అర్హత కలిగి ఉండాలనీ, అలాగే బొద్దింకలుగా చూసిన ఈ వ్యవస్థకు ఈ బొద్దింకలు అన్నీ కలిస్తే ఏమైతదో చూయిస్తాం అన్న వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం లేపుతున్నాయి. ఈ సందర్భంగా పలువురు రాజకీయ విశ్లేషకులు ఈ పార్టీ కారణంగా  యువత సోషల్ మీడియా వేదికగా ఉద్యమానికి శ్రీకారం చుట్టారు అని  అంటున్నారు.  

అలాగే ఈ కాక్రోచ్ జనతా పార్టీ' తన మేనిఫెస్టోను కూడా విడుదల చేసింది.  రిటైర్మెంట్ తర్వాత ఏ ప్రధాన న్యాయమూర్తికీ రాజ్యసభ సీటు ఇవ్వకూడదని, ఓటర్ల జాబితా నుంచి అర్హులైన ఓట్లు తొలగిస్తే చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌‌‌‌ను ఉపా (UAPA) చట్టం కింద అరెస్ట్ చేయాలని, పార్లమెంటు, కేబినెట్‌‌‌‌లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఈ మేనిఫెస్టో డిమాండ్ చేస్తోంది. 

కార్పొరేట్ సంస్థల చేతుల్లో ఉన్న మీడియా లైసెన్సులను రద్దు చేసి స్వతంత్ర మీడియాకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి మారే ఎమ్మెల్యేలు లేదా ఎంపీలపై 20 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని కూడా పేర్కొంది. అలాగే ఈ పార్టీ ఆర్టీఐ పరిధిలోకి వస్తుందని, ఎలాంటి రహస్య విరాళాలు తీసుకోబోమని స్పష్టం చేసింది.  ప్రస్తుత రాజకీయాలపై ప్రజల్లో ఉన్న అసహనమే అస్త్రంగా కాక్రోచ్​ జనతా పార్టీ అందరినీ ఆకర్షించి సోషల్​ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.

- చాపల అనిల్ కుమార్