
కౌటాల, వెలుగు: తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.. ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం.. గ్రామాల్లో బహిరంగ ప్రదేశాల్లో పొలిటికల్ బ్యానర్లు, ఫ్లెక్సీలు పెట్టకూడదు..రూ. 50 వేలకు మించి డబ్బులు కలిగి ఉంటే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
కౌటాల, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రూరల్ ఏరియాల్లో కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో ఎన్నికల నియమావళిలో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీల బ్యానర్లు, పోస్టర్లు, ఫ్లెక్సీలను ఆయా చోట్ల గ్రామ పంచాయతీ సిబ్బంది తొలగిస్తున్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటల మండల కేంద్రంలో ఉదయం నుంచే పంచాయతీ సిబ్బంది పొలిటికల్ బ్యానర్లు, ఫ్లెక్సీలను తొలగించడం విశేషం. -