
ప్రతి రోజూ ఉదయం దాల్చిన చెక్కతో చేసిన కాఫీ తాగాలి. అందులోని యాంటీ ఆక్సిడెంట్ శరీరంలో ఇమ్యూనిటీ పవర్‌ని పెంచుతుంది. ఎల్.డి.ఎల్. కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర శాతాన్ని కంట్రోల్‌లో ఉంచుతుంది. వాపు, గాయాలను నయం చేస్తుంది. టేస్టీగా ఉంటుంది.
- నాలుగు యాలక్కాయలు వేసి కాచిన కాఫీ రుచి, సువాసనే కాదు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇందులోని ఫైబర్, మినరల్స్ శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. అజీర్తి, గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం సమస్యలను పోగొడుతుంది. ముక్కు దిబ్బడ, వికారం, వాంతులు తగ్గడానికి ఇది పనిచేస్తుంది. యాలక్కాయలే కాకుండా కాఫీలో లవంగాన్ని కూడా వేయొచ్చు.
- విటమిన్– బి6, ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం, క్యాల్షియం, ఐరన్, పొటాషియం, మాంగనీస్, మినరల్స్ లాంటివి జాజికాయలో చాలా ఉన్నాయి. దీన్ని కాఫీతో పాటు కలిపి తాగితే జీర్ణ సమస్యలు పోతాయి. రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. నిద్రలేమిని పోగొడుతుంది. ముక్కు దిబ్బడను దూరం చేస్తుంది.
- అల్లం కూడా కాఫీలో వేసుకోవచ్చు. ఇది హెల్త్‌కి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది.