కాగ్నిజెంట్ చేతికి బెల్కాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

కాగ్నిజెంట్ చేతికి బెల్కాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  •  డీల్​ విలువ 1.3 బిలియన్ల డాలర్లు

న్యూఢిల్లీ: ఐటీ సర్వీసుల ప్రొవైడర్ కాగ్నిజెంట్ టెక్నో డిజిటల్ ఇంజనీరింగ్ సంస్థ బెల్కాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దాదాపు 1.3 బిలియన్ల డాలర్లకు కొనుగోలు చేయనుందని సంబంధిత వ్యక్తులు చెప్పారు. ఇది క్యాష్, స్టాక్​​డీల్​అని వెల్లడించారు.  ఈ ఒప్పందం వల్ల ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్  ఆటోమోటివ్ రంగాలలో కాగ్నిజెంట్ విస్తరిస్తుంది.

2015 నుంచి ప్రైవేట్ ఈక్విటీ సంస్థ ఏఈ ఇండస్ట్రియల్ పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నర్స్ యాజమాన్యంలో ఉన్న సిన్సినాటి ఆధారిత బెల్కాన్​కు ప్రపంచవ్యాప్తంగా 60 కేంద్రాల్లో 10 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. దీని క్లయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో బోయింగ్, జనరల్ మోటార్స్, రోల్స్ రాయిస్, నాసా, యూఎస్​ నేవీ ఉన్నాయి. ప్రస్తుత బెల్కాన్ సీఈఓ లాన్స్ క్వాస్నీవ్స్కీయే ఇక నుంచి కూడా సంస్థకు నాయకత్వం వహిస్తారు