ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఒకటైన కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్ కార్పొరేషన్ తన సంస్థ నుండి ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోంది. సంస్థ కంటెంట్ మోడరేషన్ వ్యాపారం నుండి తప్పుకోనుండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం సుమారు 6,000 మంది ఉద్యోగులపై ప్రభావం చూపనుంది. రాబోయే త్రైమాసికాల్లో మొత్తం 7,000 మంది మిడ్-సీనియర్ స్థాయి ఉద్యోగులను తొలగించాలని కంపెనీ యోచిస్తోంది.
ఫేస్ బుక్ యొక్క కంటెంట్ రివ్యూ కాంట్రాక్టర్లలో ఒకటైన కాగ్నిజెంట్, దాని కాంట్రాక్ట్ పూర్తయిన తరువాత ఈ కంటెంట్ మోడరేషన్ వ్యాపారం నుండి తప్పుకోనుంది. ఫేస్ బుక్ కంటెంట్ పై పనిచేసే మోడరేటర్ల యొక్క పని వాతావరణం..మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని కొన్ని పరిశోధనల్లో తేలడంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకొంది.

