తమిళనాడు సీఎం విజయ్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. ఓ రాష్ట్రానికి సీఎం హోదాలో ఉండి సొంతంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లటం అనేది చాలా చాలా అరుదు. సీఎం భద్రత కఠినంగా ఉంటుంది. సీఎం దగ్గర నలుగురు, ఐదుగురు అత్యంత నిపుణులైన కారు డ్రైవర్లు ఉంటారు. సీఎం ఎక్కడికి వెళ్లాలన్నా వాళ్లే చూసుకుంటారు. అలాంటి నిబంధనలు అన్నీ పక్కన పెట్టి.. తమిళనాడు సీఎం విజయ్ సొంతంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లారు. అది ఏదో 10, 20 కిలోమీటర్లు కాదు.. ఏకంగా 130 కిలోమీటర్లు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ అయ్యింది.
2026, జూన్ 13వ తేదీ ఉదయం సీఎం విజయ్ కర్నాటక రాష్ట్రం ఉడిపి జిల్లాలోని కొల్లూరు ముకాంబిక అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారికి బంగారం కత్తి బహూకరించి మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం దర్శనం అనంతనం.. ముకాంబికా దేవి ఆలయం నుంచి తిరిగి బయలుదేరారు. ఆలయం నుంచి మంగుళూరు ఎయిర్ పోర్టుకు 130 కిలోమీటర్లు.
ఆలయం నుంచి బయలకు వచ్చిన సీఎం విజయ్.. భద్రతా నిబంధనలు పక్కన పెట్టి.. తానే స్వయంగా కారు డ్రైవ్ చేస్తానని చెప్పారు. సెక్యూరిటీ సిబ్బంది ఎంత నచ్చచెప్పినా వినలేదు. సీఎం విజయ్ స్వయంగానే తానే డ్రైవ్ చేయటం మొదలుపెట్టారు.
ಕಾರಿನ ಕ್ರೇಸ್ ಹೊಂದಿರುವ ವಿಜಯ್
— kannadaprabha (@KannadaPrabha) June 13, 2026
ನಟ ವಿಜಯ್ ಗೆ ಕಾರುಗಳೆಂದರೆ ಅಪಾರ ಹುಚ್ಚು. ವಿಜಯ್ ಅವರ ತಾಯಿ ಶೋಭಾ ಚಂದ್ರಶೇಖರ್ ಹೇಳುವಂತೆ, ದಳಪತಿ ವಿಜಯ್ ಅವರು ಆಟೋಮೊಬೈಲ್ಗಳ ಬಗ್ಗೆ ಅಪಾರ ಆಸಕ್ತಿ ಹೊಂದಿದ್ದು, ಅವರ ಬಳಿ 10ರಿಂದ 12 ವಿವಿಧ ಕಾರುಗಳಿವೆ. ಅಲ್ಲದೆ, ಅವರು ದೂರದ ಪ್ರಯಾಣಕ್ಕಾಗಿ ಕಾರಿನಲ್ಲಿ ಲಾಂಗ್ ಡ್ರೈವ್ ಹೋಗುವುದನ್ನು ತುಂಬಾ… pic.twitter.com/XXud0VJXMa
కొల్లూరు ముకాంబికా దేవి ఆలయం నుంచి మంగళూరు ఎయిర్ పోర్టు వరకు 130 కిలోమీటర్లు తానే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు. ముందూ వెనకా సెక్యూరిటీ సిబ్బంది, కాన్వాయ్ కార్లు వెళ్లాయి. టోల్ గేట్ దగ్గర సీఎం విజయ్ డ్రైవింగ్ వీడియోలు బయటకు రావటంతో ఈ విషయం బయటకు వచ్చింది.
సీఎం విజయ్ డ్రైవ్ చేసిన కారు టయాటా ల్యాండ్ క్రూయిజర్ 300 మోడల్. సీఎం విజయ్ కు కార్లు అంటే పిచ్చి. డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. విజయ్ ఇంట్లో 12 రకాల కార్లు ఉన్నాయి. సీఎం కాకముందే ఎక్కువగా తానే డ్రైవ్ చేస్తూ ఉండేవారు. కొత్త కారు కొనుగోలు చేసినప్పుడు కారు రివ్యూలు కూడా ఇస్తుంటారు.
సీఎం అయిన తర్వాత డ్రైవింగ్ పక్కన సీట్లోనో.. వెనక సీట్లోనో కూర్చోవటం ఇబ్బందిగా ఉన్నట్లు ఉంది. డ్రైవింగ్ మక్కువ ఏ మాత్రం తగ్గని విజయ్.. కొల్లూరు ముకాంబికా దేవి ఆలయం నుంచి మంగళూరు ఎయిర్ పోర్టు వరకు నేషనల్ హైవేపై.. తానే స్వయంగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లారు.
చెన్నై సిటీలో ఉన్నప్పుడు.. జిల్లాల పర్యటనలకు వెళ్లినప్పుడు ఎటూ సాధ్యం కాదు.. ఇలాంటి టైంలో అయినా తన కోరికను తీర్చుకున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఏదిఏమైనా సీఎం అయినంత మాత్రాన ఇష్టమైన వాటిని ఎలా వదులుకోగలరు... అందులోనూ హీరో కదా.
