పెండింగ్ ధరణి దరఖాస్తులను పరిష్కరించాలి : కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

పెండింగ్ ధరణి దరఖాస్తులను పరిష్కరించాలి : కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

మహబూబాబాద్,వెలుగు:  ధరణి పెండింగ్​ దరఖాస్తులను  వెంటనే పరిష్కరించాలని  కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్  అధికారులకు సూచించారు.  గురువారం కలెక్టరేట్​లో  సమీక్ష నిర్వహించారు. వివిధ మాడ్యూల్లలో ఉన్న పెండింగ్  రిపోర్టులను పరిశీలించి  నివేదికలు అందజేయాలని,   పెండింగ్ సమస్యలను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.  17న  బక్రీద్‌‌  న   ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా  అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

 మున్సిపల్ కమిషనర్ల పరిధిలోని ఈద్గాల వద్ద శానిటైజేషన్​,  లైటింగ్, మంచినీటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో   అడిషనల్​ కలెక్టర్​ డేవిడ్​ , తొర్రూరు ఆర్డీవో  నరసింహరావు, జిల్లా పశుసంవర్దక శాఖ ఆఫీసర్​ సుధాకర్, మైనారిటీ  వెల్పేర్​ ఆఫీసర్​  శ్రీనివాస్,  మహబూబాబాద్, తొర్రూరు,డోర్నకల్,మరిపెడ  మునిసిపల్ కమిషనర్లు, రవీందర్, శాంతి కుమార్, నరేష్ రెడ్డి, వెంకటస్వామి, ముస్లిం మత  పెద్దలు    పాల్గొన్నా రు.