టెన్త్​ క్లాస్​ టర్నింగ్​ పాయింట్ లైట్​ తీస్కోవద్దు : కలెక్టర్ అనుదీప్​

టెన్త్​ క్లాస్​ టర్నింగ్​ పాయింట్ లైట్​ తీస్కోవద్దు : కలెక్టర్ అనుదీప్​
  • మాథ్స్​, సైన్స్​, సోషల్​ స్టడీస్​పై ఎక్కువ దృష్టి పెట్టండి
  • స్టూడెంట్లకు హైదరాబాద్కలెక్టర్​ అనుదీప్​ టీచింగ్

హైదరాబాద్​, వెలుగు: స్కూల్ స్టూడెంట్లకు టెన్త్ ​క్లాస్ టర్నింగ్ పాయింట్ అని, లైట్ తీస్కోవద్దని హైదరాబాద్​ కలెక్టర్ అనుదీప్​సూచించారు. పట్టుదలతో కష్టపడి చదివి విజయం సాధిస్తే, తల్లిదండ్రులకు గౌరవంగా ఉంటుందని పేర్కొన్నారు.  గురువారం బంజారాహిల్స్ రోడ్ నం.12లోని ఎన్​బీటీనగర్ హైస్కూల్ ను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. టెస్త్ స్టూడెంట్లకు ఏర్పాటు చేసిన ప్రత్యేక తరగతులపై టీచర్లను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు.

అనంతరం కలెక్టర్ స్టూడెంట్ల​తో ఫేస్ టు ఫేస్​ మాట్లాడుతూ..  మాథ్స్, సైన్స్, సోషల్​ స్టడీస్ ​సబ్జెక్టులపై దృష్టి పెట్టాలని, స్లిప్ టెస్టులు, మాక్​టెస్టులు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలని సూచించారు. అప్పుడే పరీక్షల ఫోబియా పోతుందని సూచించారు.  

ఆ తర్వాత వెస్ట్ మారేడ్ పల్లి మహేంద్రహిల్స్ లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, జూనియర్ కాలేజీని సందర్శించి స్టూడెం
ట్లతో మాట్లాడారు. టెన్త్ నుంచే  పోటీ పరీక్షలకు కూడా ప్రిపేర్ అవ్వాలని సూచించారు. కష్టపడి చదివి మంచి వర్సిటీలో చేరాలని అప్పుడే భవిష్యత్​బాగుంటుందని చెప్పారు. గురుకుల జూనియర్ కాలేజీలోని వివిధ డిపార్ట్​మెంట్ల​ను కలెక్టర్ పరిశీలించారు. డార్మిటరీని సందర్శించి పిల్లలతో కలిసి భోజనం చేశారు. వసతి భోజన సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు.  ప్రిన్సిపాల్, టీచర్లు​ పలు సమస్యలను కలెక్టర్​ దృష్టికి తీసుకెళ్లగా, వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంట జిల్లా డీఈవో రోహిణి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి యాదయ్య, సికింద్రాబాద్ ఆర్డీవో రవి కుమార్, సంబంధిత అధికారులు ఉన్నారు.  

టీచర్​గా మారిన కలెక్టర్..

స్టూడెంట్లకు ఎగ్జామ్స్​పై పలు సూచనలు చేసిన కలెక్టర్​ అనంతరం బోర్డు​పై మ్యాథ్స్​ సబ్జెక్టును బోధించారు. బేసిక్ ప్రిన్సిపుల్స్ తెలిసి ఉంటే ఎలాంటి సమస్యనైనా అర్థం చేసుకొని తేలికగా పరీక్షలు రాయొచ్చని సూచించారు.  క్లాసులకు హాజరుకాని పిల్లల పేరెంట్స్ ను పిలిపించి, వారి పరిస్థితిని వివరించాలని, ప్రతి సోమవారం పేరెంట్స్ మీటింగ్​ నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.