ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: రక్తహీనతతో భాదపడుతున్న బాలికల ఆరోగ్య పరిరక్షణకు పోషకాలతో కూడిన ఆహారం అందించాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో వైద్య, మహిళా, శిశు సంక్షేమ, విద్యా, పంచాయతీరాజ్, ఎస్సీ, ఎస్టీ,బీసీ సంక్షేమ శాఖల అధికారులతో వివిధ అంశాలపై సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెలా 5లోగా బయోమెట్రిక్ హాజరు వివరాలు తనకు అందించాలని చెప్పారు. ప్రైవేట్  ఆసుపత్రుల్లో ఆడిట్ నిర్వహించి డెలివరీలపై నివేదిక అందించాలని సూచించారు. గర్భిణుల ఏఎన్సీ రిజిస్ట్రేషన్లపై ఫోకస్ చేయాలని చెప్పారు. రొంపేడు పీహెచ్​సీలో ఏఎన్సీ నమోదు తక్కువగా ఉండడంతో అసహనం వ్యక్తం చేశారు. మాతా శిశు మరణాలపై సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించారు. బూస్టర్ డోస్  24 శాతం పూర్తయిందని, నూరు శాతం చేరేలా చూడాలని చెప్పారు. డీఎంఈ వైద్యులు డాక్టర్ లక్ష్మణరావు, డాక్టర్ కుమారస్వామి, డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌ వో దయానందస్వామి, డాక్టర్ ముక్కంటేశ్వరావు పాల్గొన్నారు.

బోయినపల్లి వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పోర్ట్స్ అకాడమీలో అడ్మిషన్లు
భద్రాచలం, వెలుగు: హైదరాబాద్​లోని బోయినపల్లి వాటర్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌స్పోర్ట్స్ అకాడమీలో అడ్మిషన్​ కోసం 5వ తరగతి చదువుతున్న గిరిజన బాల, బాలికలు దరఖాస్తు చేసుకోవాలని ఐటీడీఏ పీవో గౌతమ్  పోట్రు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 9న పాల్వంచ కిన్నెరసాని స్పోర్ట్స్ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జిల్లా స్థాయిలో 9 అంశాల్లో మెరిట్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌ప్రాతిపదికన ఎంపిక చేస్తామని తెలిపారు. వారిని ఈ నెల 19న సికింద్రాబాద్​లోని జింఖానా గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తుది ఎంపిక కోసం పంపిస్తామని చెప్పారు. డేట్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌ఆఫ్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌బర్త్  సర్టిఫికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఎంపిక ప్రక్రియకు హాజరు కావాలని కోరారు. పూర్తి వివరాల కోసం జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌డా.వీరూనాయక్‌‌‌‌‌‌‌‌ను ‌‌‌‌‌‌‌‌(9908601846) సంప్రదించాలని సూచించారు.

నార్మల్​ డెలివరీలను ప్రోత్సహించాలి
పెనుబల్లి, వెలుగు: కమ్యూనిటీ హెల్త్​ సెంటర్లలో నార్మల్​ డెలవరీలను ప్రోత్సహించాలని ఖమ్మం డీసీహెచ్ ​వెంకటేశ్వర్లు సూచించారు. మండల కేంద్రంలోని సీహెచ్​సీని బుధవారం సందర్శించి నూతనంగా నిర్మించే బిల్డింగ్​ స్థలాన్ని పరిశీలించి వైద్యులు సిబ్బందితో రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నార్మల్​ డెలివరీలపై గర్భిణులకు అవగాహన కల్పించాలని అన్నారు. త్వరలోనే పూర్తి స్థాయిలో బ్లడ్​బ్యాంక్​ సేవలు అందుబాటులోకి వస్తుందని, దీంతో రక్తం కోసం జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం ఉండదని చెప్పారు. సీజనల్​ వ్యాదుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న మెడికల్​ ఆఫీసర్​ డాక్టర్​ రమేశ్ ను అభినందించారు.  వైద్యులు రవికుమార్, విజ్ఞ, రంజిత్​కుమార్, అనిత, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

లోన్లు డైవర్ట్​ చేసి డబ్బులు మాయం చేసిన్రు
ములకలపల్లి, వెలుగు: ములకలపల్లి పీఏసీఎస్ లో సిబ్బంది లోన్లను డైవర్ట్​ చేసి రైతులకు తెలియకుండానే నిధులు డ్రా చేసి అక్రమాలకు పాల్పడ్దారని డైరెక్టర్లు గంగవరపు సుధాకర్, దేవభక్తిని కృష్ణ ప్రసాద్​ ఆరోపించారు. సంఘంలో ధాన్యం కొనుగోలుపై వచ్చిన రూ.6.76 లక్షలను సిబ్బంది అక్రమంగా పంచుకున్నారని తెలిపారు. మూడేళ్లుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తాత్కాలిక సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు చూపించి నిధులు కాజేశారని చెప్పారు. సొసైటీలో కొందరు రైతులు గేదెలు, బైక్​ రుణాలు తీసుకోగా, ఆ లోన్లను వ్యవసాయ రుణాలుగా మార్చి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపించారు. ఈ విషయమై కలెక్టర్, డీసీవో, చైర్మన్లకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. ఈ విషయమై పీఏసీఎస్​ చైర్మన్​ నడిపల్లి సునందను వివరణ కోరగా డీసీసీబీ మేనేజర్​తో కలిసి సిబ్బంది అక్రమాలకు పాల్పడినట్లు తన దృష్టికి వచ్చిందని, ఆ డబ్బులు తిరిగి రైతులకు అందేలా చర్యలు చేపట్టామని తెలిపారు.

పాలేరు జలాశయంలో నిమజ్జనాలు బంద్
​కూసుమంచి, వెలుగు: మండలంలోని పాలేరు జలాశయంలో వినాయక నిమజ్జనాలను నిలిపి వేస్తూ కలెక్టర్​ వీపీ గౌతమ్​ ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం సర్పంచ్​ యడవల్లి మంగమ్మ, కార్యదర్శి నరేశ్​​సిబ్బందితో కలిసి నిమజ్జనం చేసే ప్రాంతం వద్ద ఫెన్సింగ్​ ఏర్పాటు చేశారు. పాలేరు జలాశయం నుంచి సూర్యాపేట, ఖమ్మం, మహబూబాద్​ జిల్లాలకు మిషన్​ భగీరథ పథకం ద్వారా తాగునీరు సరఫరా అవుతున్నాయని, వినాయక నిమజ్జనంతో నీళ్లు కలుషితమై వ్యాధులు రాకుండా ముందుస్తు చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

సీఎంఆర్ షాపింగ్ మాల్ ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ
    సందడి చేసిన యాక్టర్లు రామ్, రీతూ వర్మ

ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం సిటీలో సీఎంఆర్ షాపింగ్ మాల్ ను బుధవారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  ప్రారంభించారు. సినీ నటుడు రామ్ పోతినేని, నటి రీతూవర్మ షాపింగ్ మాల్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సినీ నటులను చూసేందుకు అభిమాలు, ప్రజలు పోటెత్తారు. అభిమానులను ఉద్దేశించి రామ్ మాట్లాడుతూ అన్నివర్గాల ప్రజల అభిరుచులకు తగ్గట్టుగా సీఎంఆర్  షాపింగ్ మాల్ లో సంప్రదాయ, ఫ్యాషన్  వస్త్రాలు అందుబాటు ధరలో ఉన్నాయని అన్నారు. సీఎంఆర్ షాపింగ్ మాల్ ను ఆదరించాలని కోరారు. కస్టమర్ల నమ్మకమే సీఎంఆర్ షాపింగ్ మాల్స్  ఎదుగుదలకు కారణమని మేనేజింగ్ డైరెక్టర్ మావూరి వెంకట రమణ చెప్పారు. మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరరావు, ఎంపీ వద్దిరాజ్ రవిచంద్ర, సిటీ మేయర్ పూనుకోలు నీరజ, జడ్పీ చైర్మన్  లింగాల కమల్ రాజ్, మంత్రి తనయుడు నయన్ రాజ్, మాల్ ప్రతినిధులు ఫణి కుమార్, వెంకట్రావు, సుడా చైర్మన్​ బచ్చు విజయ్ కుమార్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

పాల్వంచలో భారత్ జోడో యాత్ర సంఘీభావ ర్యాలీ

పాల్వంచ, వెలుగు: ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్  వరకు చేపట్టిన భారత్ జోడోయాత్రకు సంఘీభావంగా బుధవారం పాల్వంచలో టీపీసీసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సీ కాలనీ సెంటర్​లోని హనుమాన్ ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ర్యాలీగా దమ్మపేట సెంటర్ వరకు చేరుకొని ఇందిరా గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పార్టీ నేత ఎడవల్లి కృష్ణ మాట్లాడుతూ దేశంలో అన్నివర్గాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం రాహుల్ గాంధీ యాత్ర చేపట్టారని తెలిపారు. ఐఎన్టీయూసీ ఉమ్మడి రాష్ట్రాల నాయకుడు ఎస్ఏ జలీల్, లీడర్లు నూకల రంగారావు, గద్దల రమేశ్, బొమ్మిడి మల్లికార్జున్, కొప్పుల రమేశ్, చాంద్ పాషా, మనోహర్, వీరయ్య చౌదరి, వానపాకుల రాంబాబు, రాము నాయక్, సత్యనారాయణ, సోమయ్య, సూర్యకిరణ్, దొంతు రవి పాల్గొన్నారు. 

ఉద్యమకారులపై నిర్బంధం పెడ్తున్రు

పాల్వంచ,వెలుగు: ప్రజా సమస్యలపై గళమెత్తే ఉద్యమకారులపై ప్రభుత్వం నిర్బంధం విధిస్తోందని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రాంచందర్, జిల్లా కార్యదర్శి కెచ్చెల రంగారెడ్డి ఆరోపించారు. బుధవారం పాల్వంచలోని లారీ ఓనర్స్ హాలులో పార్టీ జిల్లా స్థాయి రాజకీయ నిర్మాణ క్లాసులు జరిగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా బలమైన ఉద్యమాలను నిర్మించాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ ప్రజలపై మోయలేని భారం మోపుతుండగా, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఆరోపించారు. ప్రశ్నించే గొంతులను అణిచివేస్తున్నారని అన్నారు. ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చండ్ర అరుణ, జిల్లా నాయకులు నూపా భాస్కర్, నిమ్మల రాంబాబు, నాయిని రాజు, జి ప్రభాకర్, కల్లూరి కిశోర్, పి లక్ష్మణ్, జాటోత్ కృష్ణ, డి ప్రసాద్, బోస్, గౌస్, సంధ్య, పృథ్వి, గోనెల రమేశ్​ పాల్గొన్నారు.

సొంత ఖర్చుతో రోడ్డు విస్తరణ పనులు
కూసుమంచి,వెలుగు: మండలంలోని జీళ్లచెరువులో కొలువై ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లేందుకు ఇబ్బందిగా ఉండడంతో పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్​రెడ్డి రూ.50 లక్షల సొంత డబ్బులతో రోడ్డు విస్తరణ పనులను చేయిస్తున్నారు. డీసీసీబీ డైరెక్టర్​ ఇంటూరి శేఖర్, ఎమ్మెల్యే పీఏ శ్రీనివాసరెడ్డి బుధవారం పనులను పరిశీలించారు. పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. వార్డ్​ మెంబర్​ బాలబోయిన రమేశ్​​ఉన్నారు.

ఇరిగేషన్  ఆఫీస్​కు బిల్డింగ్  కేటాయించాలి
ఖమ్మం టౌన్, వెలుగు: సిటీలోని ఇరిగేషన్ డివిజన్–3 ఆఫీస్​ బిల్డింగ్ శిథిలావస్థకు చేరిన దృష్ట్యా ఖాళీ అవుతున్న లీగల్ సర్వీస్ బిల్డింగ్ ను కేటాయించాలని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్  అఫ్జల్ హసన్, ఆర్వీఎస్  సాగర్ బుధవారం కలెక్టర్  వీపీ గౌతమ్​కు వినతిపత్రం అందజేశారు. స్పందించిన కలెక్టర్​ లీగల్ సర్వీసెస్ కొత్త భవనం ప్రారంభించిన వెంటనే ఇరిగేషన్ శాఖకు పాత బిల్డింగ్ కేటాయించాలని అడిషనల్  కలెక్టర్  ఎన్.మధుసూధన్ కు సూచించారు. మహమ్మద్ అలీ(బాబా), జి.నరేశ్, పి.రమేశ్, టి. వెంకట్రావు, ఎ.ఉమాదేవి, వి.నాగేశ్వరరావు, ఇ.అక్షరశ్రీ, ఎస్కే ఆశ్రాయాష్మీన్,​ వి.వేణు, బి.వాసు, ఎల్.నరేంద్ర పాల్గొన్నారు.

గడపగడపకు టీఆర్ఎస్
మణుగూరు, వెలుగు: రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు ‘ఇంటింటికీ కేసీఆర్– గడపగడపకు టీఆర్ఎస్’ నినాదంతో పార్టీ నేతలు సర్వే చేపట్టారు. బుధవారం మండలంలోని సాంబాయిగూడెం గ్రామంలో జడ్పీటీసీ పోశం నరసింహారావు ఆధ్వర్యంలో టీఆర్ఎస్  లీడర్లు ఇంటింటికీ వెళ్లి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఎంపీపీ కారం విజయ కుమారి, పార్టీ మండల అధ్యక్షుడు ముత్యం బాబు, సొసైటీ ప్రెసిడెంట్ కుర్రి నాగేశ్వరరావు, రామిడి రామిరెడ్డి, బోయిళ్ల రమణయ్య, పాకాల రమాదేవి, రమ పాల్గొన్నారు.

విద్యుత్ ఏఈగా నరసింహారావు
చండ్రుగొండ,వెలుగు: చండ్రుగొండ విద్యుత్ శాఖ ఏఈగా ఎంఎల్  నరసింహారావు బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడి ఏఈ దేవా టేకులపల్లికి బదిలీ అయ్యారు. కొత్తగూడెంలో కనస్ట్రక్షన్  విభాగంలో పని చేస్తున్న నరసింహారావు బదిలీపై ఇక్కడకి వచ్చారు. వ్యవసాయ మోటార్ల వద్ద ఏర్పాటు చేసిన ఆటో స్టార్టర్ లను తొలగించాలని రైతులకు సూచించారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
సత్తుపల్లి, వెలుగు: పట్టణంలోని ఎన్టీఆర్ నగర్ సమీపంలో బైక్ ను​కారు ఢీకొనడంతో సింగరేణి ఓబీ కంపెనీ సుశీ టేక్ కు చెందిన చెన్నం నాయుడు(40) అక్కడికక్కడే చనిపోయాడు. అలాగే నెల్లూర్​కు చెందిన ప్రసాద్ కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బాలింత మృతికి కారణమైన డాక్టర్లను సస్పెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలి
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెంలోని రామవరం మాతా,శిశు సంరక్షణ కేంద్రంలో చనిపోయిన బాలింత ఈసం సరిత కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఆకుల నాగేశ్వరరావు డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. సరిత మృతిని నిరసిస్తూ ఆసుపత్రిఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే సరిత చనిపోయిందని ఆరోపించారు. సరిత మృతికి కారణమైన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.