100 శాతం టీకాలు అందించాలి

100 శాతం టీకాలు అందించాలి
  • హైదరాబాద్​ కలెక్టర్ అనుదీప్ 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే సొసైటీ బాగుంటుందని హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్ అనుదీప్ పేర్కొన్నారు. జిల్లాలో 100 శాతం టీకాలు తీసుకునే విధంగా కృషి చేయాలని, ఆశవర్కర్లు ఇంటింటికి వెళ్లి టీకాపై వివరించి తీసుకునేలా చూడాలని సూచించారు. ప్రభుత్వం చేపట్టిన ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుసులో భాగంగా సోమవారం బంజారాహిల్స్ యూపీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ పరిధిలోని భోళానగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చిన్నారులకు టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. గర్భిణులకు, ఐదేళ్లలోపు చిన్నారులకు వేస్తారని, మొదటి దశలో ఈనెల12 వ తేదీ వరకు ఇస్తారన్నారు. 

రెండో దశ వచ్చేనెల 11 వతేదీ నుంచి 16 వరకు, మూడో దశ అక్టోబర్ 9వ తేదీ నుంచి14  వరకు ఉంటుందన్నారు. అంగన్ వాడీ కేంద్రాలు, సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దవాఖానాల్లో12 రకాల టీకాలు ఉచితంగావేస్తారన్నారు. జిల్లాలో మొత్తం 1,262 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి శ్రీకళ, మెడికల్ ఆఫీసర్ నాగేంద్రరావు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

లబ్ధిదారుల ఎంపిక త్వరగా పూర్తి 

దళిత బంధు , బీసీ బంధు, మైనార్టీబంధు లబ్ధిదారుల ఎంపిక త్వరగా  పూర్తి చేయాలని అధికారులను హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్  శాంతి కుమారి నిర్వహించిన వీడియో కాన్పరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో ఆయన , ఇండ్ల స్థలాల పంపిణీ, గృహాలక్ష్మి, జీఓ 59, నోటరీ డాక్యుమెంట్స్ రెగ్యులరైజేషన్, బీసీ బంధు, మైనారిటీ బంధు, దళిత బంధు తదితర అంశాలపై సమీక్షించి మాట్లాడారు. 

అదనపు కలెక్టరు మధుసూదన్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేశ్, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి యాదయ్య, బీసీ సంక్షేమ శాఖాధికారి ఆశన్న, జిల్లా మైనార్టీ అభివృద్ధి అధికారి ఇలియాస్, అధికారులు పాల్గొన్నారు.  

కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో గాంధీ సూపరింటెండెంట్ భేటీ 

పద్మారావునగర్: హైదరాబాద్​ జిల్లా కలెక్టర్​అనుదీప్​దురిశెట్టితో  సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్​ప్రొఫెసర్​రాజారావు  సోమవారం భేటీ అయ్యారు. హాస్పిటల్ లోని సమస్యలు,  అభివృద్ధి పనులు, తదితర అంశాలపై హాస్పిటల్  డెవలప్​మెంట్ సొసైటీ(హెచ్ డీఎస్) కమిటీ  చైర్మన్ అయిన  కలెక్టర్ తో  చర్చించినట్లు సూపరింటెండెంట్​ మీడియాకు తెలిపారు. తొందరలోనే గాంధీ హాస్పిటల్ ను సందర్శిస్తానని కలెక్టర్​చెప్పినట్లు ప్రొఫెసర్ రాజారావు పేర్కొన్నారు.