
లింగంపేట, వెలుగు: పేదప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలనీ జిల్లా కలెక్టర్ ఆశిశ్ సంగ్వాన్ అన్నారు. బుధవారం ఆయన లింగంపేట మండలంలోని ముస్తాపూర్ గ్రామానికి చెందిన జూకంటి అనిత కు ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాన్ని అందించి ఇంటినిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పేద ప్రజలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తోందని ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు ఇస్తోందన్నారు. లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణాలను తొందరగా నిర్మించుకోవాలని సూచించారు. కలెక్టర్‌వెంట జిల్లా గ్రామీణాబివృద్ధి అధికారి సురేందర్, ఎంపీఓ మలహరి, ఏపీఎం శ్రీనివాస్‌ఉన్నారు.
భూములను పరిశీలించిన కలెక్టర్
లింగంపేట మండలం పోతాయిపల్లి శివారులోని సర్వే నెంబర్899లో గల భూములను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ బుధవారం పరిశీలించారు. 899 సర్వేనెంబర్ లోని భూములను గ్రామానికి చెందిన రైతులు ఏళ్లతరబడి సాగు చేస్తున్నా ఫారెస్టు ఆఫీసర్లు అటవీ భూమి అని పేర్కొంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని గ్రామ రైతులు భూభారతిలో దరఖాస్తు చేశారు. దాంతో కలెక్టర్ ప్రత్యేకంగా భూములను పరిశీలించారు. అనంతరం కోమట్‌పల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు.
కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం తూకాలు పూర్తయ్యాయని బస్తాలను లారీలలో నింపి రైస్ మిల్లులకు తరలించాల్సి ఉందని సెంటర్ నిర్వహకులు కలెక్టర్‌కు చెప్పారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విక్టర్, బాన్సువాడ సబ్‌కలెక్టర్ కిరణ్మయి, భూభారతి మండల ప్రత్యేక అధికారి రాజేందర్, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ రాజేందర్, సివిల్సప్లయ్జిల్లా అధికారి మల్లికార్జున్‌బాబు, స్థానిక తహసీల్దార్ సురేశ్ , ఆర్ఐ కిరణ్
ఉన్నారు.