
కామారెడ్డి టౌన్, వెలుగు : ఇందిరమ్మ ఇండ్లను త్వరగా నిర్మించుకునేలా అధికారులు లబ్ధిదారులను ప్రోత్సహించాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని 15, 19 వార్డుల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి మార్కవుట్ ఇవ్వడంతో పాటు, లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసి మాట్లాడారు. ‘ఇందిరమ్మ’ లబ్ధిదారులకు దశల వారీగా బిల్లులు వస్తాయన్నారు. మున్సిపల్ కమిషనర్ రాజేందర్, అధికారులు పాల్గొన్నారు.
హెడ్మాస్టర్ల పాత్ర కీలకం
గవర్నమెంట్ స్కూల్స్లో విద్యా ప్రమాణాలు మెరుగుపర్చడంలో హెచ్ఎంల పాత్ర కీలకమని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. మంగళవారం దేవునిపల్లి హైస్కూల్లో హెచ్ఎంలకు నిర్వహించిన బిల్డింగ్ ట్రైనింగ్లో కలెక్టర్ మాట్లాడారు. హెచ్ఎంలు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలన్నారు. ఆర్టిఫిషియల్తో కూడిన విద్యాబోధన చేయాలన్నారు. ప్రతి స్కూల్లో తల్లిదండ్రులతో మీటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో డీఈవో రాజు, అకాడమిక్ మానిటరింగ్ వేణుగోపాల్, ఇన్ చార్జిలు గంగా కిషన్, బల్రాం, లింగం తదితరులు పాల్గొన్నారు.