- కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
 
కామారెడ్డిటౌన్, వెలుగు: కామారెడ్డి జిల్లాలో  వానాకాలం సీజన్‌కు సంబంధించి వడ్ల కొనుగోలుకు 328 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ ఆశిశ్సంగ్వాన్ తెలిపారు.  వడ్ల కొనుగోలు సెంటర్లపై ఆయా శాఖల ఆఫీసర్లతో కలెక్టర్ మీటింగ్ నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  అక్టోబర్ రెండో వారంలో సెంటర్లు ప్రారంభిస్తామన్నారు.  జిల్లాలో 5.50 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేస్తామన్నారు.  గన్నీ బ్యాగులు, ప్యాడీ క్లీనర్లు,  టార్పాలిన్లు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.   సెంటర్లలో టెంటు, తాగునీరు,  కరెంటు సౌకర్యం కల్పించాలన్నారు.   అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి,  జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్   తిరుమల ప్రసాద్,  డీఎస్వో మల్లికార్జునబాబు,  డీఎం రాజేందర్, ఏఎస్వో నరసింహారావు,  డీసీవో రామ్మోహన్,  ట్రాన్స్ఫార్ట్ ఆఫీసర్ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
