- కలెక్టర్ హైమావతి
సిద్దిపేట రూరల్, వెలుగు: ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యానికి మేలు జరుగుతుందని కలెక్టర్హైమావతి చెప్పారు. శనివారం ప్రకృతి వ్యవసాయంపై 5 రోజుల శిక్షణ ముగియగా కలెక్టర్ పాల్గొని మహిళా రైతులకు ధ్రువపత్రాలను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. రైతులు తక్కువ ఖర్చుతో ప్రకృతి వ్యవసాయం చేసి ఆరోగ్యకర పంటలను పండించవచ్చన్నారు.
శిక్షణ కార్యక్రమంలో జీవామృతం, బీజామృతం, దశపర్ణి కషాయం, ఐదు పొరల సాగు నమూనా, వామ్, ట్రైకోడెర్మా తయారీ విధానాలపై శిక్షణ అందించారని తెలిపారు. కార్యక్రమంలో డీఏవో స్వరూపరాణి, టెక్నికల్ అధికారి మైథిలి, కృషి సఖిలు, ఏకలవ్య ఫౌండేషన్ ప్రతినిధులు తిరుపతి, రేణుక పాల్గొన్నారు.
రంజాన్ మాసం ఏర్పాట్లపై చర్చ
రంజాన్ మాసంలో ముస్లింల ప్రార్థనలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. సిద్దిపేట కలెక్టరేట్ లో ఆయా శాఖల అధికారులు, ముస్లిం పెద్దలతో సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ ఫిబ్రవరి 18 నుంచి రంజాన్మాసం ప్రారంభమవుతుందన్నారు. మసీదులు, ఈద్గాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ కుశాల్కర్, డీఆర్వో నాగరాజమ్మ, ఆర్డీవో సదానందం, డీపీవో రవీందర్, జిల్లా పౌరసరఫరాల అధికారి తనూజ, డీఎంహెచ్వో ధనరాజ్ పాల్గొన్నారు.
