సిద్దిపేట రూరల్, వెలుగు: ప్రజావాణికి వచ్చిన ప్రతీ దరఖాస్తును పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం సిద్దిపేట కలెక్టరేట్ లో ప్రజల నుంచి 154 అర్జీలను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారానికి ప్రజలు ఎంతో నమ్మకంతో ప్రజావాణికి వస్తారని అధికారులు వారి నమ్మకాన్న వమ్ము చేయవద్దని సూచించారు. సమస్యలను వేగంగా పరిష్కరించడానికి కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్, డీఆర్వో నాగరాజమ్మ, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ భవ్య పాల్గొన్నారు.
ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
వర్షాల కారణంగా దెబ్బతిన్న పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ లో లెవెల్ వంతెనలు, కల్వర్టులు, రోడ్ల శాశ్వత నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ బడులు, అంగన్వాడీ కేంద్రాలు, జీపీ ఆఫీసులు, మున్సిపాలిటీలో వివిధ నిర్మాణాల మరమ్మతు కోసం ప్రతి పాదనలు సిద్ధం చేయాలని సూచించారు. రైతులు నిర్ణీత తేమ శాతం వచ్చేవరకు ధాన్యం ఆరబెట్టుకొని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చేలా వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలన్నారు.
ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి: కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్ టౌన్: ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్లో పెట్టొద్దని, వేగంగా పరిష్కరించాలని కలెక్టర్రాహుల్రాజ్ అధికారులను ఆదేశించారు. మెదక్కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్నగేశ్ తోకలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజావాణికి మొత్తం 77 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. వాటిలో భూభారతి 36, ఇందిరమ్మ ఇళ్లు 7, పెన్షన్లు 7, ఇతర 27 దరఖాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు.
ప్రజావాణికి వచ్చిన ప్రతీ దరఖాస్తుకు సమాధానం ఇవ్వాలని అధికారులకు సూచించారు. సమస్యలు పరిష్కరించలేనప్పుడు కారణాలను తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో భుజంగ రావు, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్డీవో పీడీ శ్రీనివాసరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
అవినీతికి పాల్పడితే సహించేది లేదు
జిల్లాలో అధికారులు అవినీతికి పాల్పడితే సహించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు. మెదక్కలెక్టర్ ఆఫీసులో అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రజల వద్ద నుంచి డబ్బులను తీసుకోవడం నేరమన్నారు. జిల్లాలోని అన్ని శాఖలపై తాను దృష్టి పెట్టినట్లు చెప్పారు. ఎలాంటి ఆరోపణలు వచ్చినా విచారణ చేసి కఠిన చర్యలు తీసుకుంటానన్నారు. ప్రజలకు భరోసాగా నిలవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని గుర్తుచేశారు.
కొనుగోలు ప్రక్రియ సజావుగా నిర్వహించాలి
కౌడిపల్లి: రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర చెల్లించి ధాన్యం కొనుగోలు చేస్తోందని, అధికారులు రైతులకు లబ్ధి చేకూరేలా నిబంధనల ప్రకారం కొనుగోలు ప్రక్రియ నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. కౌడిపల్లి మండల కేంద్రంలో నాగసానిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ నేటికి జిల్లాలో 26,391 టన్నుల ధాన్యం సేకరణ పూర్తయిందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్ కవర్లు, ప్యాడి క్లీనర్లు, తేమ యంత్రాలు ఉండేలా చూసుకోవాలన్నారు.
ప్రజావాణి కి 32 దరఖాస్తులు
సంగారెడ్డి టౌన్: ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. సంగారెడ్డి కలెక్టరేట్లో అధికారులతో కలిసి ఫిర్యాదులను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వివిధ సమస్యలపై 32 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు.
వాటిని ఆయా శాఖల అధికారులకు కేటియించినట్లు చెప్పారు. సంబంధిత అధికారులు వాటిని పరిశీలించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్కలెక్టర్ మాధురి, డీఆర్వో పద్మజారాణి, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
