హుస్నాబాద్ రింగ్ రోడ్డుకు ప్లానింగ్ చేయాలి : కలెక్టర్ హైమావతి

హుస్నాబాద్ రింగ్ రోడ్డుకు ప్లానింగ్ చేయాలి : కలెక్టర్ హైమావతి

కోహెడ(హుస్నాబాద్​)వెలుగు: హుస్నాబాద్​రింగ్​రోడ్డుకు ప్లానింగ్​చేయాలని కలెక్టర్​హైమావతి అధికారులను ఆదేశించారు. మూల మలుపులు ఎక్కువ లేకుండా వెహికిల్స్​సులభంగా వెళ్లేందుకు మ్యాపింగ్​చేయాలని సూచించారు. గురువారం హుస్నాబాద్ మున్సిపల్ ఆఫీస్​లో హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలలో  చేపడుతున్న పలు అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. హుస్నాబాద్ నుంచి కొత్తపల్లి వరకు నిర్మించే 4 లైన్ల రోడ్డు నిర్మాణం పనులకు టెండర్ విధానం పూర్తి చేసి పనులను ప్రారంభించాలన్నారు. అంతక్కపేట లో 220 కేవీ విద్యుత్ జంక్షన్ నిర్మాణం కోసం స్థలం రెడీ గా ఉందని ట్రాన్స్‌‌‌‌కో  అధికారులు వెంటనే పర్మిషన్​ తీసుకోవాలని ఆదేశించారు.  కొత్త చెరువు బండ్ డెవలప్మెంట్ కోసం ఇరిగేషన్ అధికారులు అనుమతులు ఇవ్వాలని తెలిపారు.

రంగనాయక సాగర్ నుంచి నీటిని అందించడం కోసం కోహెడ మండలం బస్వాపూర్,పోరెడ్డిపల్లి లో కాలువల భూ సేకరణ ప్రక్రియ అవార్డ్ స్టేజ్ పూర్తయిందని తెలిపారు.  హుస్నాబాద్ నుంచి జనగాం వరకు నిర్మించే రోడ్డు నిర్మాణం ప్రపోజల్ స్టేజ్ లో ఉందని నాక్ సెంటర్ కోసం స్థల సేకరణ పూర్తయిందన్నారు. డిగ్రీ కాలేజీలో పీజీ, ఏంకామ్ కోర్సులో 60 సీట్లు మజూరైనట్లు తెలిపారు. 150 పడకల హస్పిటల్, కోహెడ లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ క్యాంప్లెక్స్ నిర్మాణం, ఇండస్ట్రియల్ పార్కు,ఎల్లమ్మ చెరువు సుందరీకరణ, సింగరాయకొండ ప్రాజెక్ట్ ద్వారా కొత్త ఆయకట్టుకు నీరు అందించడం కోసం కాలువల భూ సేకరణ పనులు,స్పోర్ట్స్ స్టేడియంలో ఆడిటోరియం, స్విమ్మింగ్ పూల్, జిమ్ ప్రపోజల్ తదితర అభివృద్ది పనులపై అధికారులతో చర్చించారు.ఈ సమావేశంలో ఆర్డీవో రామ్మూర్తి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.