భూ హద్దుల్లో ఎవరికీ అన్యాయం జరగదు : కలెక్టర్ హైమావతి

భూ హద్దుల్లో ఎవరికీ అన్యాయం జరగదు : కలెక్టర్ హైమావతి

గజ్వేల్​/వర్గల్​, వెలుగు: పరిశ్రమల రాకతో వర్గల్ ప్రాంతం అభివృద్ధి చెందుతోందని కలెక్టర్​హైమవతి అన్నారు. గురువారం వర్గల్ మండల కేంద్రంలోని 1641, 1642 సర్వే నంబర్లలో వివిధ కంపెనీలకు టీజీఐఐసీ కేటాయించిన భూముల్లో హద్దుల సమస్యలు తలెత్తిన ప్రాంతాలను ఆమె పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. పట్టాదారులకు, పరిశ్రమ వర్గాలకు భూహద్దుల విషయంలో ఎవరికీ అన్యాయం జరగకుండా పరిష్కరిస్తామన్నారు. 

రెండు నంబర్లలో సర్వే జరిపి హద్దులు ఏర్పాటుచేయాలని ఆమె ల్యాండ్ సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ వినయ్ కుమార్​ను ఆదేశించారు. కలెక్టర్ వెంట టీజీఐఐసీ ఎండీ కాశిరెడ్డి, ఆర్టీఓ చంద్రకళ, వర్గల్​ తహసీల్దార్ రఘువీరారెడ్డి, ఆయా కంపెనీల ప్రతినిధులు, రైతులు ఉన్నారు. అనంతరం ఆమె వర్గల్​ గవర్నమెంట్ హాస్పిటల్​ను తనిఖీ చేశారు. 

ఇటీవల ప్రారంభించిన నూతన హస్పిటల్​​భవనాన్ని పరిశీలించారు. అందులోకి పాత భవనం నుంచి ఫర్నీచర్​ను వెంటనే షిఫ్ట్​ చేయాలని ఆమె డీఎంహెచ్​వోను ఆదేశించారు. ఆస్పత్రి నూతన భవనంలో నీటి లీకేజీ సమస్యలు ఉన్నాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని ఆమె పీఆర్ ఈఈ ఫోన్​లో మాట్లాడారు.