డిజిటల్ బోర్డు పని చేయకుంటే మీరేం చేస్తున్నారండీ..?

 డిజిటల్ బోర్డు పని చేయకుంటే మీరేం చేస్తున్నారండీ..?
  • ఆసిఫ్​నగర్​ హైస్కూల్​ హెచ్ఎంపై కలెక్టర్​ ఆగ్రహం 

హైదరాబాద్ సిటీ, వెలుగు:  ‘క్లాస్​రూమ్​లో డిజిటల్ బోర్డ్ పనిచేయకపోతే మీరేం చేస్తున్నారండీ.. మీరు బాధ్యత తీసుకోకపోతే ఎట్లా?’ అంటూ ఆసిఫ్ నగర్ ప్రభుత్వ హైస్కూల్ హెచ్ఎంపై  కలెక్టర్ హరిచందన ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆమె ఆసిఫ్​నగర్​ప్రభుత్వ హైస్కూల్​ను విజిట్​చేశారు. ఈ సందర్భంగా ఆమె ప్రతి క్లాస్​రూమ్​కు వెళ్లి స్టూడెంట్స్​తో మాట్లాడారు. ఒక క్లాస్​రూంలో డిజిటల్​క్లాస్​రూం పని చేయడం లేదని తెలుసుకుని హెచ్ఎంను ప్రశ్నించారు. ఇంటర్నెట్, ఇతర సమస్యలున్నాయని చెప్పగా, అన్నీ తొందర్లోనే పరిష్కారం కావాలన్నారు. 

ప్రైవేట్​స్కూల్స్​కు దీటుగా డిజిటల్​క్లాస్​రూంల నిర్వహణ ఉండాలని, టీచర్లందరికీ డిజిటల్ క్లాసులపై అవగాహన ఉండాలన్నారు. స్కూల్​లో నీటి సమస్య ఉందని టీచర్లు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా, వాటర్ బోర్డు దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. వాటర్ ట్యాంక్, టాయిలెట్స్​ఎప్పడికప్పుడు శుభ్రం చేయించాలన్నారు. డీఈఓ  రోహిణి, డిప్యూటీ డీఈఓ బి వెంకటేశ్వర్లు, హెచ్ఎం షేక్ మొహమ్మద్ సులేమాన్ ఉన్నారు.