అభివృద్ధి పనులను సకాలంలో పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ హైమావతి

అభివృద్ధి పనులను సకాలంలో పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ హైమావతి

సిద్దిపేట రూరల్, వెలుగు: అభివృద్ధి పనులను సకాలంలో పూర్తిచేయాలని కలెక్టర్​హైమావతి అన్నారు. బుధవారం సిద్దిపేట కలెక్టరేట్ లో  వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించి ఉన్న ఇబ్బందులు, పరిపాలన అనుమతులు, టెండర్, నిధులు తదితర అంశాలపై చర్చించారు.  అంగన్వాడీ భవనాల నిర్మాణాలు, టాయిలెట్లు, గ్రామపంచాయతీ భవనాల నిర్మాణాలకు నెలాఖరు లోగా టెండర్ ప్రక్రియ పూర్తిచేసి  పనులు మొదలుపెట్టాలని ఆదేశించారు. 

అనంతరం కలెక్టర్​మున్సిపాలిటీలోని వార్డ్ నెంబర్ 37, 20 వార్డులలో పర్యటించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ స్టేటస్ ను పరిశీలించారు. 400 నుంచి 600 స్క్వేర్ ఫీట్స్  వరకు మాత్రమే ఇల్లు కట్టుకోవాలని సూచించారు. సమావేశంలో పంచాయతీ రాజ్ ఈఈ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఈ చిరంజీవులు, ఎస్ఈ వెంకట్ రెడ్డి, ఈఈ సర్దార్ సింగ్, ఆర్డీవో సదానందం, మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్, కౌన్సిలర్ సాకీ బాలలక్ష్మి, మున్సిపల్ అవార్డు ఆఫీసర్ సుమతి, హౌసింగ్ డీఈ శంకర్ పాల్గొన్నారు.

మధ్యాహ్న భోజనం నిర్వహణపై కలెక్టర్ ​ఆగ్రహం

దుబ్బాక: తొగుట మండల కేంద్రంలోని ప్రభుత్వ హైస్కూల్​లో స్టూడెంట్స్​కు వడ్డించిన మధ్యాహ్న భోజనాన్ని కలెక్టర్​ఆకస్మికంగా తనిఖీ చేశారు. మెనూ ప్రకారం కాకుండా ఒకే కూరను వడ్డించడమేంటని సిబ్బంది, నిర్వాహకులను ప్రశ్నించారు. నిర్వహణ లోపాలపై డీఈవోకు నివేదిక పంపించాలని ఎంపీడీవో శ్రీనివాస్​రెడ్డిని కలెక్టర్ ఆదేశించారు. భోజనం రుచికరంగా ఉందా అని స్టూడెంట్స్​ను అడిగి తెలుసుకున్నారు. 

మెనూ పాటించకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చిరించారు. అంతకుముందు గ్రామంలో పర్యటించి ఇందిరమ్మ ఇళ్ల మార్కింగ్, నిర్మాణ ప్రగతిని పరిశీలించారు. కలెక్టర్​ వెంట తహసీల్దార్​శ్రీకాంత్​, ఎంఈవో నర్సయ్య, హెచ్​ఎంఉపేందర్​ ఉన్నారు.