- అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్
నల్గొండ అర్బన్, వెలుగు: యువత చదువులో పాటు సంస్కృతి, కళలు, సాహిత్యం ,పెయింటింగ్ రంగాల్లో రాణించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ అన్నారు. శనివారం నల్గొండలోని కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి మెమోరియల్ కాలేజీలో జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో 2025- – 26 జిల్లా స్థాయి యువజన ఉత్సవాలను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి యువత స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. వివేకానందుడు ప్రపంచానికి భారతీయ సంస్కృతి, విలువలు, యువత శక్తిని గుర్తు చేసిన మహానుభావుడన్నారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి అక్బర్ అలీ, కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి కాలేజీ ప్రిన్సిపల్ ఉపేందర్, ఒకేషనల్ ప్రిన్సిపల్ రాకేంద్, నాగార్జున డిగ్రీ ఓపెన్ కాలేజీ ప్రిన్సిపల్ బొజ్జ అనిల్, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ మనీషా సింగ్, బాలు పాల్గొన్నారు.
