ప్రాచీన కట్టడాలను సంరక్షించుకోవాలి: కలెక్టర్​ జితేశ్

ప్రాచీన కట్టడాలను సంరక్షించుకోవాలి: కలెక్టర్​ జితేశ్
  • ఆకట్టుకున్న భరతనాట్యం, శివపార్వతుల ప్రదర్శన

కామారెడ్డి, వెలుగు: ప్రాచీన కాలం నాటి కట్టడాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని కలెక్టర్​ జితేశ్ ​వీ పాటిల్​ పేర్కొన్నారు. భిక్కనూరులోని ప్రసిద్ధ సిద్ధరామేశ్వర ఆలయ సమీపంలోని  కోనేరు వద్ద ఆదివారం రాత్రి జరిగిన కల్చరల్ ప్రోగ్రామ్స్​ను ఆయన ప్రారంభించారు. కలెక్టర్​ మాట్లాడుతూ.. పురాతన బావులను పునరుద్ధరించడం వల్ల భావితరాలకు పురాతన కట్టడాల ప్రముఖ్యత తెలియడంతో పాటు, భూగర్భజలాలు పెరుగుతాయన్నారు. కోనేరు పునరుద్ధరణకు ముందుకొచ్చిన దాతలు కల్పన, రమేశ్​ను కలెక్టర్​ అభినందించారు. స్థానిక ఎంపీపీ గాల్​రెడ్డి,  ప్రజాప్రతినిధులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యల్లో పాల్గొన్నారు.

ఆకట్టుకున్న కల్చరల్​ ప్రోగ్రామ్స్​

ప్రాచీన భిక్కనూరు సిద్ధరామేశ్వర ఆలయ కోనేరు పునరుద్ధరణ అనంతరం ఆదివారం రాత్రి చేపట్టిన భరతనాట్యం, శివపార్వతుల నృత్యం ఆకట్టుకున్నాయి. కోనేరును రంగురంగుల దీపాలతో అలంకరించారు.