కామారెడ్డి జిల్లాలో 347 కొనుగోలు సెంటర్లు

కామారెడ్డి జిల్లాలో 347 కొనుగోలు సెంటర్లు

కామారెడ్డి, వెలుగు: వడ్ల కొనుగోళ్ల కోసం జిల్లాలో 347 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ జితేశ్​వి పాటిల్​ పేర్కొన్నారు. ఈ నెల చివరి వారంలో సెంటర్లు ప్రారంభమవుతాయన్నారు. మంగళవారం కలెక్టరేట్​లో వడ్ల కొనుగోళ్లపై నిర్వహించిన మీటింగ్​లో ఆయన మాట్లాడారు. జిల్లాలో 2,92,105 ఎకరాల్లో వరి పంట సాగు కాగా,  6.50 లక్షల మెట్రిక్​ టన్నుల దిగుబడి వచ్చే అవకాశముందన్నారు. ఇందుకనుగుణంగా సొసైటీల ఆధ్వర్యంలో 325, ఐకేపీ ఆధ్వరంలో 22 సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. 

రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు సవ్యంగా జరిగేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్​ఆదేశించారు. ప్యాడీ క్లీనర్లు, కాంటాలు, టార్పాలిన్లు రెడీ చేసుకోవాలన్నారు.  గన్ని సంచుల కొరత రానీయొద్దన్నారు. ఎన్నికల విధులు నిర్వహిస్తూనే వడ్ల కొనుగోళ్లు కూడా జరిగేలా చూడాలన్నారు. అడిషనల్ ​కలెక్టర్​ చంద్రమోహన్, అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, డీఎస్వో మల్లికార్జున్​బాబు,  డీఎం  అభిషేక్, ఆఫీసర్లు భాగ్యలక్ష్మీ, రమ్య, సింహాచలం, వాణి, రైస్​మిల్లర్స్​అసోసియేషన్ ​జిల్లా ప్రెసిడెంట్​లింగం పాల్గొన్నారు.

కౌంటింగ్​సెంటర్​పరిశీలన..

ఎన్నికల కౌంటింగ్​సెంటర్​ను మంగళవారం కలెక్టర్​జితేశ్​వి పాటిల్​పరిశీలించారు. ఫర్నిచర్, ఇతర వసతులు  కల్పించాలని ఆఫీసర్లను ఆదేశించారు. అడిషనల్​కలెక్టర్​చంద్రమోహన్​, ఎలక్షన్​వింగ్​ఆఫీసర్​ప్రేమ్​కుమార్, ఇంద్ర ప్రియదర్శిని, నరేందర్​తదితరులు పాల్గొన్నారు.