సీజనల్​ వ్యాధులపై అలర్ట్ గా ఉండాలి : కలెక్టర్  కోయ శ్రీహర్ష

సీజనల్​ వ్యాధులపై అలర్ట్ గా ఉండాలి : కలెక్టర్  కోయ శ్రీహర్ష

నారాయణపేట, వెలుగు : జిల్లాలో సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్  కోయ శ్రీహర్ష వైద్యాధికారులు, సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్​ మీటింగ్​ హాల్​లో సీజనల్ వ్యాధుల నియంత్రణపై రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సీజనల్ వ్యాధులు అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహించి మందులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. సబ్  సెంటర్లను తనిఖీ చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు.

సబ్ సెంటర్లలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి పరిస్థితులపై సమీక్షించాలని సూచించారు. గ్రామాల్లో దోమల నివారణకు ఫాగింగ్  చేయాలని, హాస్టళ్లలో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. డెంగీ వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేకంగా వార్డ్  ఏర్పాటు చేయాలన్నారు. డీఎంహెచ్​వో రాంమనోహర్ రావు, ఆసుపత్రి సూపరింటెండెంట్ రంజిత్, డాక్టర్ సౌభాగ్య లక్ష్మి, డాక్టర్ శైలజ, భిక్షపతి పాల్గొన్నారు.