నస్పూర్, వెలుగు: ఏ రంగంలోనైనా అభివృద్ధి సాధించాలంటే కొత్తగా ఆలోచించాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. నస్పూర్‌లోని ఆక్స్ఫర్డ్ స్కూల్లో నిర్వహించిన 53వ జిల్లాస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమానికి డీఈవో యాదయ్య, అధికారులు, స్కూల్ ప్రతినిధులతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సైన్స్ రంగం రోజురోజుకూ అభివృద్ధి చెందుతోందని, నూతన ఆలోచనల ద్వారానే ఇది సాధ్యమవుతోందన్నారు. విద్యార్థులను సాంకేతికత వైపు ప్రోత్సహించాలని సూచించారు. విద్యార్థులు సైన్స్ లో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి తెలుసుకోవాలని, నిరుత్సాహపడకుండా ఏకాగ్రతతో అభ్యసించాలన్నారు. సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
