నామినేషన్ల ప్రక్రియ సమర్థవంతంగా చేపట్టాలి : కలెక్టర్ కుమార్ దీపక్

నామినేషన్ల ప్రక్రియ సమర్థవంతంగా చేపట్టాలి : కలెక్టర్ కుమార్ దీపక్

జైపూర్(భీమారం), వెలుగు : సర్పంచ్​ఎన్నికల్లో భాగంగా మూడో విడత నామినేషన్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. గురువారం భీమారం మండలం భీమారం, పోలంపల్లి, ఆరేపల్లి, భీమారం, బూర్గుపల్లి, నర్సింగాపూర్(బి), దాంపూర్, ధర్మారం, కాజిపల్లి గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఆయన పరిశీలించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నామినేషన్ ప్రక్రియలో అభ్యర్థులు సమర్పించిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, నిర్ణీత గడువు దాటిన తర్వాత వచ్చే నామినేషన్లను తీసుకోవద్దన్నారు. నామినేషన్లు పరిశీలించి అర్హులు, అనర్హుల జాబితాలో పూర్తి వివరాలతో రూపొందించాలని చెప్పారు. ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా కొత్త బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించాలని తెలిపారు. 

అధికారులు ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఎన్నికల ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలన్నారు. అనంతరం మండల కేంద్రంలోని కేజీబీవీ స్కూల్​లో కొనసాగుతున్న అదనపు గదుల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. కలెక్టర్​వెంట ఎంపీడీవో మధుసూదన్, సీఐ నవీన్, సిబ్బంది ఉన్నారు.