
ఇయ్యాల మూడు సెంటర్ల ప్రారంభం
కోల్‌బెల్ట్, వెలుగు: అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల (ఏటీసీ) ద్వారా నిరుద్యోగ యువతకు అధునాతన సాంకేతిక విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మందమర్రిలోని ఏటీసీని కలెక్టర్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు నూతన పరికరాల ద్వారా అధునాతన సాంకేతిక విద్యను అందించేందుకు ప్రభుత్వం ఏటీసీలను ఏర్పాటు చేసిందన్నారు.
ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకుని వృత్తి విద్యలో నైపుణ్యత సాధించి ఉపాధి పొందాలని సూచించారు. శనివారం మంచిర్యాల, మందమర్రి, నస్పూర్‌లో ఏసీటీ సెంటర్లను ప్రారంభించనున్నట్లు తెలిపారు. అనంతరం మందమర్రి ఎంపీడీవో ఆఫీస్‌ను సందర్శించి మండల పరిధిలో కొనసాగుతున్న పనుల పురోగతి వివరాలను అడిగి తెలుసుకున్నారు.అభివృద్ధి పనులను పూర్తిచేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ సతీశ్ కుమార్, ఎంపీడీవో రాజేశ్వర్తదితరులున్నారు.