నస్పూర్, వెలుగు: గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. హాజీపూర్ మండల ప్రభుత్వ ఉద్యోగులు సేకరించిన దుప్పట్లను శుక్రవారం పెద్దంపేట్ పరిధిలోని కొలాంగూడలో 40 గిరిజన కుటుంబాలకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చలి ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రజల రక్షణ కోసం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గిరిజన పిల్లలు చదువుకునేందుకు పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు ఏర్పాటు చేశామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
గిరిజన ప్రాంతాల్లో అంతర్గత రహదారులు, తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలో ఏమైనా సమస్యలుంతే తమ దృష్టికి తీసుకురావాలని స్థానికులకు సూచించారు.
