వైద్యాధికారులు పనితీరు మెరుగుపర్చుకోవాలి : కలెక్టర్ పమేలా సత్పతి

వైద్యాధికారులు పనితీరు మెరుగుపర్చుకోవాలి  : కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్ టౌన్, వెలుగు : ప్రభుత్వాస్పత్రులకు వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ తమ పనితీరు మెరుగుపర్చుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి వైద్యాధికారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్ లో వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. పీహెచ్సీలవారీగా ప్రసవాలు, ఎన్ఆర్సీ రిపోర్ట్, ఆరోగ్య మహిళ, ఎన్ సీడీ రిపోర్ట్, డెంగీ కేసులు, టీబీ కేసులు, వ్యాక్సినేషన్, ఓపీ, ఐపీ కేసులు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్క్రీనింగ్, హైపర్ టెన్షన్, డయాబెటిస్ తదితర కేసుల వివరాలను పరిశీలించారు. 

ఇమ్యూనైజేషన్ పూర్తికాకపోవడం, ప్రసవాల సంఖ్య తగ్గడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. డాక్టర్లు తప్పనిసరిగా ఎంసీపీ కార్డు, కేసు షీట్ పై సంతకాలు చేసి కేసు వివరాలు రాయాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీవాకడే, డీఎంహెచ్ వో వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.